రాహుల్‌తో స్పీకర్ ప్రసాద్‌కుమార్ భేటీ
ABN , Publish Date - May 30 , 2026 | 04:15 AM
త్వరలో మంత్రివర్గ్గ విస్తరణ చేపడతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు అధిష్ఠానం నుంచి పిలుపు రావడం..
అధిష్ఠానం పిలుపుతో హుటాహుటిన ఢిల్లీకి పయనం
క్యాబినెట్‌లో చోటు కల్పించాలని కోరిన ప్రసాద్‌కుమార్
వికారాబాద్, మే 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): త్వరలో మంత్రివర్గ్గ విస్తరణ చేపడతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు అధిష్ఠానం నుంచి పిలుపు రావడం.. ఆయన పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో శుక్రవారం హుటాహుటిన ఢిల్లీ వె ళ్లిన ప్రసాద్‌కుమార్ అక్కడ రాహుల్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు వివిధ అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే ప్రసాద్‌కుమార్ తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని రాహుల్‌ను కోరినట్లు తెలిసింది. తాను ఏ పరిస్థితుల్లో క్యాబినెట్‌లో అవకాశం కోరుకుంటున్నాననేది ఈ సందర్భంగా రాహుల్‌కు వివరించినట్లు సమాచారం.