kumaram bheem asifabad- ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
ABN , Publish Date - Sep 17 , 2026 | 11:34 PM
జిల్లా వ్యాప్తంగా ప్రజా పాతన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జెండాలు ఎగురవేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ హరిత, జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ నితికా పంత్ జాతీయ జెండాను అవిష్కరించారు
ఆసిఫాబాద్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ప్రజా పాతన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జెండాలు ఎగురవేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ హరిత, జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ నితికా పంత్ జాతీయ జెండాను అవిష్కరించారు.అలాగే ్ల గ్రంధాలయంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చెర్మన్ అనిల్, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ అంజయ్యలు జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, అయా శాకల అధికారులు, పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్/వాకండి/బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలు వారి సిద్దాంతాలకు అనుగుణంగా వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవంగా, బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జాతీయ సమైఖ్యత దినోత్సవంగా, బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవంగా వేర్వేరుగా వేడుకలను జరుపుకున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బీజేపీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలంలు జాతీయ జెండాను ఎగుర వేశారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో గ్రంధాలయసంస్థ చైర్మన్ అనిల్, నియోజకవర్గ ఇన్‌చార్జీ శ్యాంనాయక్, మార్కెట్ కమిటీ చైర్‌పర్షన్ మంగ, ఫ్లోర్‌లీడర్ అబ్దుల్లా, మండల, టౌన్ అధ్యక్షులు మురళీ, ఇమ్రాన్, కౌన్సిలర్లు కార్తీక్, భాగ్యలక్ష్మి, గోవింద్, కృష్ణమ్మ, డీసీసీ ఉపాధ్యక్షులు తారీక్, భీంరావు, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఆహ్మద్, పీఏసీఎస్ చైర్మన్ ఆలీబీన్ ఆహ్మద్, కౌన్సిలర్లు వెంకన్న, సాలం, రాజంపేట సర్పంచ్ బుర్స పోచయ్య, ఉపసర్పంచ్ లక్ష్మి, బీఆర్‌ఎస్ నాయకులు సరస్వతి, నిసార్, ఆహ్మద్, అన్సార్, సమద్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లిఖార్జున్ యాదవ్, బీజేపీ నాయకులు గొల్ల, సుజిత్, రంజిత్, అశోక్, పోశన్న తదితరులు పాల్గొన్నారు. వాంకిడి తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ కవిత, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీవో ఖాజా అజీజోద్దిన్, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో గోపికాంత్, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం కోనయ్య, పీఏసీఎస్ కార్యాలయంలో చైర్మన్ జాబిరే పెంటు జెండా ఎగురవేశారు. ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాల్ తిరుపతి, వాంకిడి గ్రామ పంచాయతీలో సర్పంచు సతీష్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు గుర్నులే మెంగాజీ, జాతీయ పతాకాలను ఎగురవేశారు బెజ్జూరు మండల వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ రామ్మోహన్‌రావు, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఎస్సై విజయ్, ఏవో నాగరాజు, ఇన్‌చార్జీ రేంజ్ అధికారి శ్రావణ్‌కుమార్, ఎస్‌వో అరుణ, సర్పంచ్ సరోజా తదితరులు ఉన్నారు.
కాగజ్‌నగర్/సిర్పూరు(టి)/కెరమెరి/చింతలమానేపల్లి/దహెగాం/పెంచికల్‌పేట/కౌటాల/తిర్యాణి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ పట్టణ, మండలంలో గురువారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నీ ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను సంబంధిత అధికారులు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో అన్నీ శాఖల అధికారులు పాల్గొన్నారు. మార్వడి సమాజ్ ఆధ్వర్యంలో రాజస్థాన్ భవన్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు రాధాకిషన్ జవార్, కమల్ కిషోర్ బంగ్, తరుణ్, విక్కి, నిత్య ప్రకాష్, వివేక్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో కూడా పలు చోట్ల జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే సిర్పూరు(టి)లో మండల కేంద్రంలో అన్నీ ప్రభుత్వ కార్యాలయాల్లో గురువారం ప్రజా పాలన దినోత్సవ ఘనంగా జరిగింది. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీవో కోట ప్రసాద్, తహసీల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ రహిమోద్దీన్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. సిర్పూరు(టి) సర్పంచ్ నాగమణి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. కెరమెరిలో మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో గురువారం ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కెరమెరి మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీవో అంజద్ పాషా, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై రాజు, తహసిల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నాగర్జున గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. గోయగాంలో సర్పంచ్ ఆత్రం ఆనంద్‌రావు, కెరమెరిలో పెందోర్ ఆనంద్ రావు, నిషానిలో సర్పంచ్ అంబరావు, సావర్‌ఖేడ్ తులసిరాం జాతీయ జెండాలను తదితరులు పాల్గొన్నారు. చింతలమానేపల్లి మండలంలో గురువారం ప్రజాపాలన దినోత్సవ ఘనంగా నిర్వహించారు. . కౌటాలలో కూడా ప్రజాపాలన దినోత్సవాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. పెంచికల్‌పేటలో రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ రవీందర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే రెబ్బెనలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం శ్రీ రమేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందేశాన్ని ఉద్యోగులకు చదివి విన్పించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి, కైరిగూడ ఓసీ పీఓ నరేందర్, ఎస్‌ఓటు జీఎం రాజమల్లు, ఇంజనీర్ వీరన్న, దేవరకొండ కిరణ్‌బాబు పాల్గొన్నారు. తిర్యాణి, దహెగాం మండలాల్లో కూడా ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి డైరెక్టర్ నైతం రాంచందర్, జిల్లా కార్యదర్శి శోభన్, నాయకులు వెంకన్న, సురేష్, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.