దేశాన్ని ప్రమాదంలో పడేసిన మోదీ
ABN , Publish Date - May 12 , 2026 | 04:09 AM
మోదీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కార్పొరేట్ శక్తుల అనుకూల విధానాలతో దేశాన్ని మోదీ ప్రమాదంలో...
సంఘటిత ఉద్యమాలతోనే దేశానికి రక్షణ
సీపీఐ ఎంల్ మాస్‌లైన్ నేత ప్రదీప్ సింగ్
ఇల్లెందు, మే 11 (ఆంధ్రజ్యోతి) : మోదీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కార్పొరేట్ శక్తుల అనుకూల విధానాలతో దేశాన్ని మోదీ ప్రమాదంలో పడేశారని సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ జాతీయ కార్యదర్శి ప్రదీ్‌పసింగ్ ఠాగూర్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రజాహిత సంస్థలన్నీ సంఘటితంగా మిలిటెంట్ పోరాటాలు సాగించకపోతే దేశాన్ని రక్షించుకోలేమని స్పష్టం చేశారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) ప్రథమ జాతీయ మహాసభల ప్రారం భం సందర్భంగా కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందులో సోమవారం బహిరంగ సభ నిర్వహించారు. సభలో ప్రదీప్ సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ హిందుత్వ విధానాలతో కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్ ఫాసిస్టు శక్తులు దేశానికి హాని తలపెడుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతులను మరింత కుంగదీస్తున్నాయన్నారు. సీపీఐఎంఎల్ మాస్‌లైన్ కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ దేశీయ వ్యవసాయ రంగానికి అమెరికా, ఇండియా వాణిజ్య ఒప్పందం ఉరితాడుగా మారిందన్నారు. దేశీయ వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా విదేశీ వస్తువులను దిగుమతి చేస్తూ రైతులను కడగండ్ల పాలు చేస్తున్నారన్నారు. రా:ంలో సీఎం రేవంత్ రెడ్డి తీరు పిట్టల దొర మాదిరిగా ఉందని విమర్శించారు. ప్రస్తుత పరిణామాలను విప్లవ శక్తులు అధ్యయనం చేయాలని, కలిసి నడిస్తేనే మనుగడ సాధ్యమని స్పష్టం చేశారు. సభకు ముందు వేలాది మంది రైతుకూలీలు పట్టణంలో భారీ ప్రదర్శన జరిపారు.