తిరుపతిలో రెడ్డి భవనం నిర్మాణానికి రూ.కోటి
ABN , Publish Date - May 03 , 2026 | 05:24 AM
తిరుపతిలో నిర్మించనున్న ఇంటర్నేషనల్ రెడ్డి సంఘం భవన నిర్మాణం కోసం పీపీ రెడ్డి గ్రూపు చైర్మన్, యాదగిరిగుట్ట రెడ్డి సంక్షేమ సంఘం..
విరాళం ప్రకటించిన పీపీ రెడ్డి గ్రూపు చైర్మన్ పర్వతాల్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ/సరూర్‌నగర్, మే 2(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో నిర్మించనున్న ఇంటర్నేషనల్ రెడ్డి సంఘం భవన నిర్మాణం కోసం పీపీ రెడ్డి గ్రూపు చైర్మన్, యాదగిరిగుట్ట రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు పన్నాల పర్వతాల్ రెడ్డి రూ.కోటి విరాళాన్ని ప్రకటించారు. రెడ్డి సంఘం ప్రతినిధులు మురళీకృష్ణారెడ్డి, మల్‌రెడ్డి రాంరెడ్డి, వినయ్‌కుమార్‌రెడ్డి, గూడూరు నరోత్తం రెడ్డి, కొలను మహేందర్‌రెడ్డి తదితరుల సమక్షంలో ఈ మేరకు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా వారు పర్వతాల్‌రెడ్డిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అఖిల భారత రెడ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలో అధునాతన సౌకర్యాలతో ఇంటర్నేషనల్ రెడ్డి సంఘం భవనం నిరించనున్న విషయం తెలిసిందే.