Share News

అచ్చంపేటలో పోతురాజు విగ్రహం పునఃప్రతిష్ఠ

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:38 PM

అచ్చంపే ట పట్టణంలోని శ్రీపోచమ్మ దేవాలయంలో పోతురాజు విగ్రహం పునఃప్రతిష్ఠ కార్య క్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు.

అచ్చంపేటలో పోతురాజు విగ్రహం పునఃప్రతిష్ఠ
పోతురాజు విగ్రహం పునఃప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : అచ్చంపే ట పట్టణంలోని శ్రీపోచమ్మ దేవాలయంలో పోతురాజు విగ్రహం పునఃప్రతిష్ఠ కార్య క్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి స్థానిక ఎమ్మెల్యే డా క్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ ము ఖ్య అతిథిగా హాజరయ్యా రు.ముందుగా ఎమ్మెల్యే వం శీకృష్ణ పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛరణాల మధ్య పోతురాజు విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్ర మాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆలయ అభివృద్ధిపై నిర్వాహకులతో మా ట్లాడారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కల్పించేందుకు సహకరిస్తామని తెలి పారు. ఈ కార్యక్రమంలో పోచమ్మ దేవాలయ ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు, మాజీ ము నిసిపల్‌ చైర్మన్‌ గార్లపాటి శ్రీనివాసులు, పట్టణ పుర ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2026 | 11:38 PM