Share News

kumaram bheem asifabad- గుంతల రోడ్డు.. ఏళ్లుగా అవస్థలు

ABN , Publish Date - Oct 29 , 2026 | 10:57 PM

: కాగజ్‌నగర్‌ క్రాస్‌ రోడ్డు కాగజ్‌నగర్‌ వరకు ఉన్న ప్రధాన రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. క్రాస్‌ రోడ్డు నుంచి పెద్దవాగు బ్రిడ్జి వరకు రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. మరోవైపు బ్రిడ్జిపై పూర్తిగా గుంతలు పడి ఉన్నాయి. అధికారులు ఆరు నెలల క్రితం తాత్కాలిక మరమ్మతులు చేశారు. గత రెండు నెలల క్రితం కురిసిన వర్షాలతో తాత్కాలికంగా మరమ్మతులు చేసిన పనులన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోయాయి. దీంతో మళ్లీ గుంతలు ఏర్పడి వాహనదారుల రాకపోకలకు అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొన్నది.

kumaram bheem asifabad- గుంతల రోడ్డు.. ఏళ్లుగా అవస్థలు
కాగజ్‌నగర్‌ పెద్దవాగు వంతెనపై ఏర్పడిన గుంత

- మరమ్మతులు చేపట్టాలని వాహనదారుల వినతి

కాగజ్‌నగర్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ క్రాస్‌ రోడ్డు కాగజ్‌నగర్‌ వరకు ఉన్న ప్రధాన రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. క్రాస్‌ రోడ్డు నుంచి పెద్దవాగు బ్రిడ్జి వరకు రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. మరోవైపు బ్రిడ్జిపై పూర్తిగా గుంతలు పడి ఉన్నాయి. అధికారులు ఆరు నెలల క్రితం తాత్కాలిక మరమ్మతులు చేశారు. గత రెండు నెలల క్రితం కురిసిన వర్షాలతో తాత్కాలికంగా మరమ్మతులు చేసిన పనులన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోయాయి. దీంతో మళ్లీ గుంతలు ఏర్పడి వాహనదారుల రాకపోకలకు అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొన్నది. కాగజ్‌నగర్‌ క్రాస్‌ రోడ్డు వచ్చే ప్రధాన రహదారిపై ఏడాదిలోనే ఐదు ప్రమాదాలు జరిగి ముగ్గురు మృత్యు వాత పడ్డారు. కేవలం గుంతను తప్పించబోయి ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు. జాతీయరహదారి భద్రత వారోత్సవాల్లో రోడ్డు ప్రమాదాల నివారణ గురించి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కనీసం గుంతలను పూడ్చక పోవ డంతో ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు వాపోతున్నారు. గుంతలపై తాత్కాలిక మరమ్మతులు చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారనే తప్పా శాశ్వత పరిష్కారం మార్గం చూపడం లేదని పలువురు ప్రయాణికులు అధికారులు తీరుపై మండి పడుతున్నారు. నిత్యం ఈరోడ్డు మీదుగానే అధికారులు, నాయకులు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని చెబుతు న్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

Updated Date - Oct 29 , 2026 | 10:57 PM