kumaram bheem asifabad- ఇంటి వద్దకే తపాలా సేవలు
ABN , Publish Date - Jul 03 , 2026 | 10:18 PM
ప్రస్తుతం డిజిటల్ యుగమే నడుస్తున్నప్పటికీ సైబర్ నేరాల భయం ఉన్న వారు, వయో వృద్ధులతో పాటు ఎంతో కొంత నగదు కావాల్సిన వారు తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లడమో, ఏటీఎం వద్దకు వెళ్లడమో చేయాల్సిందే. లైన్లలో నిల్చోవాల్సిందే. ఖాతా తెరవాలన్నా, నగదు కావాలన్నా, బ్యాంకులకు వెళ్లాల్సిందే. ఈ ఇబ్బం దులు తొలగేలా తపాలా శాఖ ఇంటి వద్దకే వచ్చి పలు రకాల సేవలు అందిస్తోంది.
- తక్కువ సమయంలోనే ఖాతా తీసుకునే అవకాశం
కాగజ్‌నగర్ టౌన్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం డిజిటల్ యుగమే నడుస్తున్నప్పటికీ సైబర్ నేరాల భయం ఉన్న వారు, వయో వృద్ధులతో పాటు ఎంతో కొంత నగదు కావాల్సిన వారు తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లడమో, ఏటీఎం వద్దకు వెళ్లడమో చేయాల్సిందే. లైన్లలో నిల్చోవాల్సిందే. ఖాతా తెరవాలన్నా, నగదు కావాలన్నా, బ్యాంకులకు వెళ్లాల్సిందే. ఈ ఇబ్బం దులు తొలగేలా తపాలా శాఖ ఇంటి వద్దకే వచ్చి పలు రకాల సేవలు అందిస్తోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని తపాలా కార్యాలయాలు, ఉప కార్యాలయాల్లో సేవలు అందిస్తారు. ఈ విషయంలో తపాలా శాఖ అందించే ప్రతీ సేవను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ ప్రాంతాల్లో ఉన్నటు వంటి తపాలా కార్యాలయాల్లో సేవలు అందుబాటులో ఉంటున్నాయి. అయితే ప్రజలకు వీటిపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
- నిమిషాల్లోనే ఖాతా
బ్యాంకులో ఖాతా తెరవడం పెద్ద ప్రయాసే. కానీ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులో కేవలం 10 నిముషాల్లో ఖాతా తెరవవచ్చు. ఇంటికి వచ్చిన పోస్టుమ్యాన్‌కు ఆధార్, పాన్ కార్డు తదితర వివరాలు చెబితే మీ పేరిట ఖాతా తెరుస్తారు. ఈ ఖాతా ద్వారా డబ్బు జమ చేయడం, తీసుకోవడం, ఇతరులకు పంపడం వంటి 14 రకాల సేవలు పొందవచ్చునని తపాలా శాఖా ఽఅధికారులు తెలిపారు.
- ఇంటివద్దనే ముఖ్య సేవలు..
తపాలా శాఖ సేవల్లో ముఖ్యమైన ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏఈపీఎస్) ద్వారా ఏ ఖాతా నుంచి అయినా డబ్బును ఇంటి వద్దనే విత్ డ్రా చేసుకోవచ్చు. ఇంటికి వచ్చిన పోస్ట్ మ్యాన్‌కు ఆధార్ నెంబర్ చెప్పి బయోమెట్రిక్ మిషన్‌పై వేలి ముద్ర వేయగానే మీ పేరి ట ఉన్న అన్ని బ్యాంకు ఖాతాలు కనిపిస్తాయి. ఏ ఖాతాలో ఎంత నగదు ఉందో తెలుసుకోవడంతో పాటు అందులో నుంచి డబ్బు డ్రా చేసుకోవచ్చు. రోజుకు రూ. 10 వేల వరకు నగదు తీసుకునే వెసులుబాటు ఉంది. కాగా డబ్బులను పొదుపు చేసే సుకన్య సమృద్ధి యోజన, రికరింగ్ డిపాజిట్, సీనియర్ సిటిజన్ పొదుపు ఖాతా వంటి 13 రకాల పొదుపు ఖాతాలు ఇంటి వద్దనే తెరవవచ్చు. అవసరైన పత్రాలను పోస్ట్‌మ్యాన్‌కు అందిస్తే చాలు వీటితో పాటు తపాలా శాఖ అందించిఏ 16 రకాల బీమా ఖాతాలను సైతం ఇంటి వద్ద నుంచి తెరిచేందుకు అవకాశం ఉంది. పింఛనుదారులకు వసరమయ్యే, డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను సైతం ఇంటి వద్దనే పొందవచ్చు. అయితే ఇలా అనేక రకాల సేవలు అందించేందుకు డోర్ డెలివరీకి నామ మాత్రంగా వసూలు చేసే ఛార్జీలు మా త్రం వినియోగదారులు కట్టవలసి ఉంటుందని పోస్టల్ శాఖ సిబ్బంది తెలిపారు.
- బీమా పాలసీ డబ్బుల చెల్లింపులు
అలాగే రూ. 10 లక్షల నుంచి రూ 15 లక్షల వరకు ప్రయోజనంతో హెల్త్ ప్లస్, ఎక్స్‌ప్రెస్ హెల్త్ ఇన్సూరెన్సు స్కీంలను తపాల శాఖ ఆధ్వర్యంలో ప్రవేశ పెట్టారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్ శాఖ కోరుతోంది. టాటా, నివా, ఆదిత్య బిర్లా, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు, తపాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో తక్కువ ప్రీమియంతో రూ. 10లక్షల నుంచి రూ 15 లక్షల ప్రమాద బీమా అందిస్తోంది. 18 నుంచి 65 ఏళ్ల లోపు వారు ఈ పథకానికి అర్హులు. ఏడాదికి ఒకేసారి రూ. 520, రూ. 555, రూ. 549, రూ. 559 ప్రీమియంతో ఆయా సంస్థలు రూ. 10 లక్షలు, రూ. 755, రూ. 749, రూ. 799తో రూ. రూ. 15 లక్షలు ప్రయోజనం అందిస్తు న్నా యి. పాలసీదారు ప్రమాదవశాత్తు మృతి చెందిన సమయాల్లో మాత్రమే వారిపై ఆధార పడిన కుటుంబ సభ్యులకు బీమా ప్రయోజనం అందుతుంది. ఈ మొత్తాలను కూడా ఇంట వద్ద నుంచి చెల్లింపులు చేసుకోవచ్చు.