పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నివారణకు పోష్ చట్టం దోహదం
ABN , Publish Date - Jun 28 , 2026 | 03:38 AM
మహిళలు పనిచేసే ప్రదేశాల్లో ఎదుర్కొనే అనేక రకాల లైంగిక వేధింపులు ప్రత్యక్షంగానే కాకుండా, మాట లు, ప్రవర్తన, సంకేతాలు లేదా ఇతర ...
సీఐడీ చీఫ్ చారు సిన్హా
ప్రొబేషనరీ డీఎస్పీలకు మహిళల భద్రతపై అవగాహన
హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): మహిళలు పనిచేసే ప్రదేశాల్లో ఎదుర్కొనే అనేక రకాల లైంగిక వేధింపులు ప్రత్యక్షంగానే కాకుండా, మాట లు, ప్రవర్తన, సంకేతాలు లేదా ఇతర అనుచిత వ్యవహారాల రూపంలో కూడా ఉండవచ్చని సీఐడీ చీఫ్ చారు సిన్హా పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డీఎస్పీలకు ‘పని ప్రదేశాల్లో మహిళల భద్రత - పోష్ చట్టం అమలు, మహిళలు ఎదుర్కొనే సమస్యలు’ అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన సీఐడీ చీఫ్ చారు సిన్హా పని ప్రదేశాల్లో మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నివారణ(పోష్) చట్టం గురించి సమగ్రం గా వివరించారు. అలాంటి ఘటనలను మహిళలు సకాలంలో గుర్తించి, చట్టపరంగా అందుబాటులో ఉన్న రక్షణ వ్యవస్థలను వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం మహిళా భద్రత విభాగం కౌన్సిలర్ ఇషా శర్వాణి మహిళలు తమ ఉద్యోగ జీవితంలో ఎదుర్కొనే మానసిక, సామాజిక, వృత్తిపరమైన సవాళ్లు, లైంగిక వేధింపుల వివిధ రూపాలు, వాటిని ఎదుర్కొనే విధానాలను వివరించారు.