మూత్రపిండాలు పాడై.. పేద యువతి బతుకు భారమై
ABN , Publish Date - Apr 14 , 2026 | 04:50 AM
రెక్కాడితేగానీ డొక్కాడని ఆ పేద కుటుంబాన్ని.. భర్తను కోల్పోయిన మహిళ కూలి పనులు చేస్తూ పోషించుకుంటోంది. ఇంతలో వారికి ఊహించని సమస్య ఎదురైంది.
శస్త్ర చికిత్సకు స్థోమత లేక సతమతం దాతలు స్పందించాలని వేడుకోలు
ఖమ్మం కలెక్టరేట్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి) : రెక్కాడితేగానీ డొక్కాడని ఆ పేద కుటుంబాన్ని.. భర్తను కోల్పోయిన మహిళ కూలి పనులు చేస్తూ పోషించుకుంటోంది. ఇంతలో వారికి ఊహించని సమస్య ఎదురైంది. ఆమె కుమార్తెకు కిడ్నీలు పాడై మంచానికి పరిమితమవడంతో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఖమ్మం నగరంలోని ఖానాపురం యూపీహెచ్ కాలనీలో నివసించే అరూరి ప్రమీల భర్త వెంకటేశ్వర్లు చనిపోవడంతో కుటుంబభారం ఆమెపైనే పడింది. కుమారుడు నాగేంద్రచారి కార్పెంటర్ పనికి, ఆమె కూలి పనులకు వెళుతూ రోజులు గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆమె కూతురు ఉమామహేశ్వరికి(26) రెండు కిడ్నీలు పాడవడంతో మంచానికే పరిమితమైంది. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో వైద్యులకు చూపించగా సాధ్యమైనంత త్వరగా శస్త్రచికిత్స చేయించాలని సూచించారు. రోజువారీ మందులు కొనేందుకే డబ్బులు లేక.. బాధితురాలి దీనావస్థను చూడలేక అల్లాడుతున్న కుటుంబ సభ్యులు.. శస్త్రచికిత్స చేయించేదెలా అని కుంగిపోతున్నారు. తమ కుమార్తెకు ఆపరేషన్ చేయించేందుకు, మందులకు చేయూత ఇవ్వాలని, దాతలు స్పందించాలని తల్లి ప్రమీల వేడుకుంటోంది. ఆపన్నహస్తం అందించేవారు 9392133306 నంబర్‌కు ఫోన్ పే చేయాలని కోరుతోంది.