kumaram bheem asifabad- చాలీచాలని వేతనం.. కుటుంబ పోషణ భారం
ABN , Publish Date - Jun 05 , 2026 | 10:25 PM
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో పని చేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ (వీవోఏ)ల నెల వేత నం కేవలం రూ. 5వేలు మాత్రమే. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వస్తే వీవోఏలకు రూ. 18వేలు వేతనం ఇస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కావడం లేదు. ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారడం లేదని వీవోఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు
చింతలమానేపల్లి, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో పని చేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ (వీవోఏ)ల నెల వేత నం కేవలం రూ. 5వేలు మాత్రమే. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వస్తే వీవోఏలకు రూ. 18వేలు వేతనం ఇస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కావడం లేదు. ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారడం లేదని వీవోఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. మహిళా సంఘాల అభివృద్ధికి ఎల్లఏళలా కృషి చేస్తున్న తమ శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదని వీవోఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలీ చాలని వేతనంతో కుటుంబ పోషణ భారమవుతోం దని చెబుతున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు డిమాండ్ల సాధన కోసం ఇటీవల నిరవధిక సమ్మె చేపట్టారు. ఇటీవల రాష్ట్ర దనసరి సీతక్క(అనసూయ) జిల్లా పర్యటనలో భాగంగా కలిసి తమ గోడును వెల్లబో సుకున్నారు. మంత్రి సీతక్క సైతం తమ సమస్యల సానుకూలంగా మాట్లాడినట్లు వారు చెబుతున్నారు.
- గ్రామ స్థాయిలో..
గ్రామ స్థాయిలో ఎస్‌హెచ్‌జీలను బలోపేతం చేయడంలో వీవోఏలు కీలకపాత్ర పోషిస్తారు. పేదరిక నిర్మూలన, జీవనోపాధి కార్యక్రమాల్లో సంఘాల సభ్యులకు మార్గనిర్ధేశం చేస్తారు. సంఘాల లెక్కలు, బ్యాంకు లింకేజీలు, రికార్డులు, రుణాల ప్రక్రియలో సహాయంగా పని చేస్తారు. శ్రీనిధి, సీఐఎఫ్, వీవో నిధుల వినియోగాన్ని పర్యవేక్షిస్తారు. సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాల గురించి కార్యక్ర మాలను చేపడుతున్నట్లు చెబుతున్నారు. అంతే కాకుండా సంఘాలు తీసుకున్న రుణాలు సక్రమంగా కట్టేలా చూడడం, గ్రూప్ సభ్యులను ప్రోత్సహించడం, సభ్యుల డేటా సేకరించి అప్టేడ్ చేయడం వంటి పను లతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాలను ఆన్‌లైన్ చేయడం మండల స్థాయి అధికారులతో సమన్వయకర్తగా పని చేస్తున్నారు. తమ శక్తికి మించి పనులు చేస్తున్నా వీవోఏలకు వేత నం రూ. 5000 మాత్రమే అందుతుందని, సెర్ప్‌లో ఇతర ఉద్యోగులతో పని చేస్తున్నప్పటికీ శ్రమకు తగ్గ వేతనం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రాష్ట్ర మంత్రి సీతక్క స్పం దించి చర్చలకు పిలవడంతో తమ సమస్యలు నెరవేరుతాయన్న ఆశ తో ఎదురుచూస్తున్నారు. వీవోఏలకు కనీస వేతనంగా రూ. 20 వేలకు పెంచాలని,. సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, హెచ్‌ఆర్ పాలసీ వర్తింపజేయాలి కోరు తున్నారు. అర్హులైన వీవోఏలను సీసీలుగా నియమిం చాలని, ట్యాబ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. జీవో 58 ను సవరించాలని వీవోఏల ప్రధాన డిమాండ్లుగా చెబుతున్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి.
- కెడెకర్ మధుకర్, వీవోఏల మండల సంఘం అధ్యక్షుడు
ప్రభుత్వం వెంటనే మాకు ఉద్యోగ భద్రత కల్పిం చేలా చర్యలు తీసుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసు కెళ్లేందుకు ఎంతగానో కృషి చేస్తున్నాం. మాకు ఉద్యోగ భద్రత లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతు న్నాం. మా సమస్యలను గుర్తించి న్యాయం చేయాలి. శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వాలి.
చాలీచాలని వేతనాలతో అవస్థలు..
- కొండు స్వప్న, వీవోఏల సంఘం జిల్లా కార్యదర్శి
చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి ఉంది. సెర్ప్‌ను బలోపేతం చేయడంలో వీవో ఏలు కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రమ దోపిడీ గుర వుతున్నాం. వెంటనే శ్రమకు తగ్గ వేతనం చెల్లించాలి. ప్రభుత్వం మమ్మల్ని చిన్నచూపు చూడడం సరికాదు. ప్రభుత్వం మాకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలి.