Share News

‘దోస్త్‌’కు స్పందన కరువు...!

ABN , Publish Date - Sep 24 , 2026 | 11:55 PM

రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ను ఉన్నత వి ద్యామండలి ఈ ఏడాది ఏప్రిల్‌ 13న విడుదల చేసిన విషయం తెలిసిందే. మొదటి విడుత రిజిస్ర్టేషన్లు అదే నెల 15న ప్రారంభం కాగా ఈ నెల 7తో ముగిసింది.

‘దోస్త్‌’కు స్పందన కరువు...!

-నేటితో ముగియనున్న స్పాట్‌ అడ్మిషన్లు

-ఐదు విడుతలు ముగిసినా భర్తీకాని సీట్లు

-స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించినా కానరాని ఫలితం

-జిల్లాలో 47 శాతానికే పరిమితమైన కేటాయింపులు

మంచిర్యాల, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ను ఉన్నత వి ద్యామండలి ఈ ఏడాది ఏప్రిల్‌ 13న విడుదల చేసిన విషయం తెలిసిందే. మొదటి విడుత రిజిస్ర్టేషన్లు అదే నెల 15న ప్రారంభం కాగా ఈ నెల 7తో ముగిసింది. అనంతరం రెండు, మూడు విడుతల్లో అడ్మిషన్‌ ప్రక్రి య పూర్తికావలసి ఉంది. అందుకు భిన్నంగా ఈ వి ద్యా సంవత్సరంలో ఇప్పటికే ఐదు విడుతలుగా నోటి ఫికేషన్లు జారీ కాగా, ప్రస్తుతం స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వ హిస్తున్నారు. అయినప్పటికీ అశించిన మేర విద్యార్థుల నుంచి స్పందన రాలేదు. జిల్లాలో కేవలం 47 శాతం మాత్రమే సీట్లు భర్తీ కావడం గమనార్హం. వివిధ కా రణాల చేత విద్యార్థుల నుంచి పెద్దగా స్పందన లేన ట్లు తెలుస్తోంది. దోస్త్‌ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రభు త్వ, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల్లో బకెట్‌ సిస్టమ్‌, రిజర్వేషన్ల తో ప్రవేశాలు చేపడుతున్నారు. ఇంటర్మీడియట్‌ ఉత్తీ ర్ణులైన విద్యార్థులు డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్స రం ప్రవేశాల కోసం దోస్త్‌ ద్వారా దరఖాస్తు చేసు కుం టే, మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

జిల్లాలో అందుబాటులో 5,910 సీట్లు ....

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో మొ త్తం 5,910 వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొదటి దఫా కౌన్సెలింగ్‌ కోసం విడుదల చేసిన నోటి ఫికేషన్‌లో జిల్లాలో మొత్తం 7500 సీట్లను కేటాయిం చారు. ఐదు విడుతల కౌన్సెలింగ్‌ ముగిసినప్పటికీ వి ద్యార్థుల నుంచి పెద్దగా స్పందన లేని కారణంగా దా దాపు 1590 సీట్లను రద్దు చేసినట్లు తెలుస్తోంది. తగ్గిం చిన సీట్లు కూడా భర్తీ కాకపోవడం గమనార్హం. జి ల్లాలో మంచిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూరు, బెల్లంపల్లి పట్టణాల్లో ఒక్కొక్కటి చొప్పున నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా, జిల్లా కేంధ్రంలో మహాత్మా జ్యో తిభా పూలే డిగ్రీ కళాశాల (బాలుర), తెలంగాణ మ హిళ సాంఘీక సంక్షేమశాఖ డిగ్రీ కళాశాలలు ఉన్నా యి. అలాగే ప్రైవేటు కళాశాలలు 12 వరకు ఉన్నా యి. ప్రైవేటు కళాశాలల్లో కేవలం ఐదు కళాశాలల్లోనే అడ్మిషన్లు జరుగగా, మిగతా వాటిలో ఒక్కరూ చేరక పోవడం శోచనీయం.

ఆరు దశల్లో అడ్మిషన్‌ ప్రక్రియ....

సాధారణంగా డిగ్రీ అడ్మిషన్ల కోసం మూడు విడు తల్లో రిజిస్ట్రేషన్లు చేస్తుంటారు. అందుకు భిన్నంగా రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ ఏడాది ఆరు విడుతల్లో అడ్మిషన్లు సేకరిస్తున్నారు. మొదటి మూడు విడుతలు ముగిసిన తరువాత స్పెషల్‌ అడ్మిషన్‌-1, 2ల పేరుతో మళ్లీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. రాష్ట్రంలో మొదటి విడుత దరఖాస్తు ప్రక్రియ 13-04-2026 నుంచి 23-05-2026 వరకు చేపట్టగా, రెండో విడుత 31-05- 2026 నుంచి 05-06-2026 వరకు, మూడో విడుత 06-06-20226 నుంచి 04-07-2026 వరకు నిర్వహిం చారు. సీట్లు భర్తీ కాకపోవడంతో స్పెషల్‌ డ్రైవ్‌ అడ్మి షన్‌ ప్రక్రియ చేపట్టారు. అందులో మొదటి డ్రైవ్‌ 20- 07-2026 నుంచి 01-08-2026 వరకు కొనసాగగా, రెం డో డ్రైవ్‌ 06-08-2026 నుంచి 18-08-2026 వరకు సా గింది. అయినప్పటికీ నిర్ణయించిన మేరకు సీట్లు భర్తీ కాకపోవడంతో ఈ నెల 24,25 తేదీల్లో స్పాట్‌ కౌన్సె లింగ్‌ నిర్వహిస్తున్నారు. 2026-27 విద్యా సంవత్స రానికి సంబంధించి జిల్లాలోని నాలుగు ప్రభుత్వ, ఐదు ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు గాను మొత్తం 5910 సీట్ల ను కేటాయించగా, స్పాట్‌ కౌన్సెలింగ్‌ మొదటి రోజు ముగిసే గురువారం నాటికి కేవలం 2806 సీట్లు మా త్రమే భర్తీ అయ్యాయి. కేటాయించిన సీట్లలో భర్తీ అయినవి కేవలం 47.47 శాతం మాత్రమే ఉండటం గమనార్హం.

దోస్త్‌కు ఇతర ఎంట్రన్స్‌ పరీక్షల దెబ్బ...

మొదటి విడుత దోస్త్‌ రిజిస్ట్రేషన్‌లపై నీట్‌, ఎంసెట్‌, పాలిసెట్‌ ప్రవేశ పరీక్షల ప్రభావం పడటంతో ఊహిం చిన విధంగానే అడ్మిషన్లు జరగలేదు. ఆయా పోటీ పరీక్షలు ముగిసిన తరువాత రెండు, మూడో విడుతల వరకు విద్యార్థుల నుంచి స్పందన లభిస్తుందని ఆశిం చారు. అప్పుడు కూడా సీట్లు భర్తీ కాకపోవడంతో రెండు స్పెషల్‌ డ్రైవ్‌లతోపాటు రెండు రోజులపాటు స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాల్సి వచ్చింది. ఇదిలా ఉం డగా ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు ఫీజు రీయంబర్స్‌ మెంట్‌ లేని కారణంగా ఆయా కాలేజీల్లో అడ్మిషన్లు ఘననీయంగా తగ్గు ముఖం పట్టాయి. ఇంతకాలం ఫీ జు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి పేద, మద్యతరగ తి విద్యార్థులు ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో వివిధ కో ర్సుల్లో చేరేవారు. రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వ సుము ఖంగా లేకపోవడంతో సొంతంగా ఫీజులు చెల్లించి, ప్రైవేటు కాలేజీల్లో చదవలేని విద్యార్థులంతా రెండు, మూడు విడుతల్లో దోస్త్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరారు. దీనికి తోడు ఈ ఏడాది నుంచి బీకాంలో కొత్తగా బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ ఇండస్ట్రీస్‌) అనే జాబ్‌ ఓరియంటెడ్‌ కోర్సును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో 80 శాతం సీట్లు ఆ విభాగంలోనే భర్తీకాగా, ఐ టీవల వైపు కూడా పెద్ద మొత్తంలో విద్యార్థులు మొ గ్గు చూపుతున్నారు. ఈ కారణంగా డిగ్రీ స్థాయిలో అ డ్మిషన్లకు విద్యార్థుల నుంచి పెద్దగా ఆధరణ లభించ డం లేదు. ఇక ప్రైవేటు కళాశాలల పరిస్థితి అయితే ఆగమ్యగోచరంగా తయారైంది. అడ్మిషన్లు లేక కళాశాల లు మూసివేయవలసిన పరిస్థితులు నెలకొన్నాయి.

Updated Date - Sep 24 , 2026 | 11:55 PM