బీజేపీది మోసపూరిత యాత్ర: పొన్నం
ABN , Publish Date - May 26 , 2026 | 04:25 AM
ఓ వైపు ఇంధన ధరలు పెంచి ప్రజలు, రైతుల నడ్డి విరుస్తున్న బీజేపీ.. మరోవైపున రైతు భరోసా పేరుతో మోసపూరిత యాత్రలు చేస్తోందని మంత్రి పొన్నం...
బస్సు యాత్ర కాదు.. ఢిల్లీ యాత్ర చేయండి: ఆది శ్రీనివాస్
హైదరాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి): ఓ వైపు ఇంధన ధరలు పెంచి ప్రజలు, రైతుల నడ్డి విరుస్తున్న బీజేపీ.. మరోవైపున రైతు భరోసా పేరుతో మోసపూరిత యాత్రలు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. నిజంగా తెలంగాణ రైతాంగంపై బీజేపీ వాళ్లకు ప్రేమ ఉంటే ముందుగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలన్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసే విషయంలో కేంద్రం సహకరించడం లేదన్నారు. కేవలం 53.73 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు మాత్రమే అనుమతినిచ్చిందని మండిపడ్డారు. బీజేపీ నేతలు చేయాల్సింది బస్సు యాత్ర కాదని, ప్రతి గింజనూ కొనాలని కేంద్రాన్ని కోరుతూ ఢిల్లీ యాత్ర చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హితవు పలికారు. ధాన్యం కళ్లాల దగ్గరికి వెళ్లి షో చేస్తున్న బీఆర్‌ఎస్ నేతలు.. కేంద్రంలోని బీజేపీని ఎందుకు ప్రశ్నించట్లేదని నిలదీశారు. రైతుల కోసం బీజేపీ ఏం చేసిందో చెప్పాలని విప్ విజయరమణారావు ప్రశ్నించారు.