Share News

రాహుల్‌పై విమర్శలంటే ఆకాశంపై ఉమ్మేయడమే

ABN , Publish Date - Mar 05 , 2026 | 01:12 AM

రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టాలని కోరుకోవడం తమ హక్కని, ప్రజాస్వామ్యంలో నాయకత్వాన్ని నిర్ణయించేది ప్రజలేనని బండి..

రాహుల్‌పై విమర్శలంటే ఆకాశంపై ఉమ్మేయడమే

  • ఆయన్ను ప్రధానిగా చూడాలనుకోవడం మా హక్కు

  • బండి సంజయ్‌ వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన మంత్రి పొన్నం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టాలని కోరుకోవడం తమ హక్కని, ప్రజాస్వామ్యంలో నాయకత్వాన్ని నిర్ణయించేది ప్రజలేనని బండి సంజయ్‌ కాదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. రాహుల్‌పై సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన బుధవారం ఒక ప్రకటనలో తీవ్రంగా స్పందించారు. తమ అగ్రనేతపై విమర్శలు చేయడమంటే ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిదని, అది తిరిగి సంజయ్‌ ముఖం మీదే పడుతుందని కౌంటర్‌ ఇచ్చారు. రెండుసార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్‌ తెలంగాణకు అదనపు నిధులు తేలేని దద్దమ్మ అంటూ పొన్నం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 12 ఏళ్లుగా బీజేపీ పాలనలో దేశ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని విమర్శించారు. దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టుపెట్టిన మీరు.. రాహుల్‌ గాంధీ గురించి మాట్లాడతారా అని ఆయన నిలదీశారు.

Updated Date - Mar 05 , 2026 | 01:12 AM