Ponnam Prabhakar: నిర్లక్ష్యం వల్లే రోడ్డు ప్రమాదాలు
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:23 AM
అతి వేగం, నిర్లక్ష్యం, మద్యం తాగి వాహనం నడపటం, రాంగ్ రూట్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
నిబంధనలు పాటిస్తే అడ్డుకట్ట: మంత్రి పొన్నం
హైదరాబాద్/పంజాగుట్ట, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : అతి వేగం, నిర్లక్ష్యం, మద్యం తాగి వాహనం నడపటం, రాంగ్ రూట్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రంలో ఏటా 26 వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, 8 వేల మంది చనిపోతున్నారని, సగటున రోజూ 22 మంది చనిపోతున్నారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు నిబంధనలు పాటించడం ఒక్కటే మార్గమని చెప్పారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం పొన్నం ప్రారంభించారు. రోడ్డు భద్రతా మాసోత్సవ పోస్టర్, వాహనాల స్టిక్కర్, విద్యార్థులకు రోడ్ ేసఫ్టీ అవగాహన పుస్తకాలను ఆవిష్కరించారు. ఆర్టీసీ కళా భవన్‌లో 30 ఏళ్లుగా ప్రమాదరహితంగా పనిచేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లను సత్కరించారు.