Share News

రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ తొలి సభ్యుడిగా పొన్నం అశోక్‌గౌడ్‌

ABN , Publish Date - Mar 12 , 2026 | 05:08 AM

ఇటీవల ప్రాధాన్యతా ఓటింగ్‌ పద్ధతిలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో .. తొలి సభ్యుడిగా మంత్రి....

రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ తొలి సభ్యుడిగా పొన్నం అశోక్‌గౌడ్‌

హైదరాబాద్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఇటీవల ప్రాధాన్యతా ఓటింగ్‌ పద్ధతిలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో .. తొలి సభ్యుడిగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ సోదరుడు, టీపీసీసీ లీగల్‌సెల్‌ ఛైర్మన్‌ పొన్నం అశోక్‌గౌడ్‌ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు బుధవారం ప్రకటించారు. పోలైన ఓట్లు, మొత్తం అభ్యర్థుల సంఖ్యను బట్టి 1,085 ఓట్లను కటాఫ్‌ సంఖ్యగా నిర్ణయించారు. దీనిని చేరుకున్న అశోక్‌ గౌడ్‌ నిలిచారు.

Updated Date - Mar 12 , 2026 | 05:10 AM