Share News

kumaram bheem asifabad- అడుగంటిన చెరువులు

ABN , Publish Date - Mar 22 , 2026 | 11:06 PM

జిల్లాలో పలు చోట్ల చెరువులు అడుగంటి పోవడంతో యాసంగి పంటలు ఎండిపోతున్నాయి. ఎండలు ముదురుతండడంతో యాసంగి పంటలకు నీటి కరవు తీవ్రంగా ఏర్పడింది. జిల్లాలోని పలు చెరువుల్లో నీటి మట్టం తగ్గుతుండడంతో పొలాలకు సరిపడా నీరు చేరడం లేదు. దీంతో సాగులో ఉన్న పంట ఎండి పోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

kumaram bheem asifabad- అడుగంటిన చెరువులు
ఎండిపోతున్న జొన్న పంట

జైనూర్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు చోట్ల చెరువులు అడుగంటి పోవడంతో యాసంగి పంటలు ఎండిపోతున్నాయి. ఎండలు ముదురుతండడంతో యాసంగి పంటలకు నీటి కరవు తీవ్రంగా ఏర్పడింది. జిల్లాలోని పలు చెరువుల్లో నీటి మట్టం తగ్గుతుండడంతో పొలాలకు సరిపడా నీరు చేరడం లేదు. దీంతో సాగులో ఉన్న పంట ఎండి పోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో యాసంగిలో సుమారు 1.37 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌, కెరమెరి, తిర్యాణి మండలాల్లో నీటి ఎద్దడి తీవ్ర ప్రభావం చూపుతోంది. చెరువులు, కాలువలు సకాలంలో మరమ్మతులు చేయక పోవడం వల్ల పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. దీంతో కాలువల ద్వారా చివరికి నీరు రావడం లేదని రైతులు చెబుతున్నారు.

పరిస్థితి ఇలా..

జైనూర్‌ మండలంలోని సంబాజీగూడ, కాసుపటేల్‌ గూడ, సిర్పూర్‌(యు) మండ లంలోని రాఘాపూర్‌, జంగాం చెరువుల్లో నీరు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో పిచ్చి మొక్కలు విస్తరించాయి. దింతో చెరువుల్లో నీరు నిలువ సామర్థ్యం తగ్గి పోతుందని రైతులు వాపోతున్నారు. ప్రతి సంవత్సరం ఇదే సమస్య ఎదురవుతున్న అధికారులు సరియైున చర్యలు చేపట్టడం లేదని వారు ఆవేదన చ్యక్తం చేస్తున్నారు. యాసంగి సీజనులో ఆహార ధాన్యాలు పండించే రైతులు ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో ఉన్నారు.జిల్లా వ్యాప్తం గా మొక్క జొన్న, గోధుమ, జొన్న, శనగలు, కూరగాయాలు ఏజేన్సి ప్రాంతంలో సాగులో ఉన్నాయి. పంటలు ఎండి పోతుండడంతో పెట్టు బడులు వృధా అవుతాయనే భయం వారి వెంటాడుతుంది. ఏటా ఆహార ధాన్యాల సాగు తగ్గుతోం. అధికారులు స్పం దించి చెరువులు, కాలువల్లో పూడిక, చెత్తాచెదారం తొలగించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Mar 22 , 2026 | 11:06 PM