Share News

11న పోలింగ్‌..13న కౌంటింగ్‌

ABN , Publish Date - Jan 27 , 2026 | 10:49 PM

ఎప్పుడెప్పు డా అని ఎదురు చూస్తున్న మునిసిపల్‌ ఎన్నికల నోటి ఫికేషన్‌ ఎట్టకేలకు విడుదల అయింది. రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్‌ ఎన్నికల నిర్వహణకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణికుమదిని గెజిట్‌ విడుదల చే శారు. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికలు ముగియగానే మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.

11న పోలింగ్‌..13న కౌంటింగ్‌

మోగిన మునిసిపల్‌ ఎన్నికల నగారా...

-షెడ్యూల్‌ విడుదల

-నేటి నుంచి 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ

-తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్‌

మంచిర్యాల, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ఎప్పుడెప్పు డా అని ఎదురు చూస్తున్న మునిసిపల్‌ ఎన్నికల నోటి ఫికేషన్‌ ఎట్టకేలకు విడుదల అయింది. రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపల్‌ ఎన్నికల నిర్వహణకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణికుమదిని గెజిట్‌ విడుదల చే శారు. వాస్తవానికి లోక్‌సభ ఎన్నికలు ముగియగానే మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడం, పాలనపై పట్టు సాధించేందుకు కొంత సమయం పట్టింది. దీంతో మునిసిపల్‌ ఎన్నికల నిర్వహణలో సంవత్సరం పాటు జాప్యం జరిగింది. మునిసిపాలిటీల పదవీకాలం గత ఏ డాది జనవరి 26వ తేదీతో ముగిసింది. ఏడాది తరు వాత ఎట్టకేలకు ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైం ది. పాలక వర్గాలు రద్దు కావడంతో ఏడాది కాలంగా మున్సిపాలిటీలు ప్రత్యేకాధికారుల పాలనలో పని చేస్తు న్నాయి. ఎట్టకేలకు షెడ్యూల్‌ విడుదల కావడంతో ప ట్టణాల్లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్‌తోపాటు బెల్లంపల్లి, లక్షెట్టిపేట, చెన్నూర్‌, క్యాతన్‌పల్లి మునిసిపాలిటీలలో ఎన్నికలు జ రుగనున్నాయి. నోటిఫికేషన్‌ విడుదల అయినందున త క్షణమే ’కోడ్‌’ అమల్లోకి రానుంది. తిరిగి ఎన్నికల ప్రక్రి య ముగిసే వరకు కోడ్‌ అమల్లో ఉండనుండగా, ఈ సమయంలో నగదు, మద్యం, ఇతర ఓటర్లను ప్రలో భాలకు గురి చేసే వస్తువుల పంపిణీని నిశేధించనున్నారు.

మునిసిపాలిటీల వారీగా రిజర్వేషన్లు....

మంచిర్యాల మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవి బీసీ జనరల్‌ విభాగానికి రిజర్వు అయింది. అలాగే బె ల్లంపల్లి మునిసిపల్‌ చైర్మన్‌ పదవి జనరల్‌ మహిళకు కేటాయించగా, లక్షెట్టిపేట చైర్మన్‌ పదవిని ఎస్సీ జనరల్‌కు, క్యాతన్‌పల్లి జనరల్‌ మహిళకు, చెన్నూరు బీసీ మహిళకు రిజర్వు చేశారు. మంచిర్యాల కార్పొరేష న్‌లో మొత్తం 60 డివిజన్‌లకు గాను ఎస్టీ -01, ఎస్సీ- 09, బీసీ-20, జనరల్‌ స్థానాలకు -30 సీట్లు కేటాయిం చారు. అలాగే బెల్లంపల్లి మునిసిపాలిటీలో 34 వార్డుల కు గాను ఎస్టీ-01, ఎస్సీ-10, బీసీ-06, జనరల్‌ స్థానాల కు-17 కేటాయించగా, క్యాతన్‌పల్లిలో 22 వార్డులకు గా ను ఎస్టీ-01, ఎస్సీ-07, బీసీ-03, జనరల్‌ స్థానాలు-11, చె న్నూరులో 18 వార్డులకు గాను ఎస్టీ-01,ఎస్సీ-03, బీసీ- 05, జనరల్‌ స్థానాలు-09, లక్షెట్టిపేటలో 15 వార్డులకు గాను ఎస్టీ-01, ఎస్సీ-03, బీసీ-03, జనరల్‌ వర్గాల వారికి స్థానాలు-08 కేటాయించారు.

444 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు...

జిల్లాలోని మంచిర్యాల మునిసిపల్‌ కార్పొరేషన్‌తో పా టు ఎన్నికలు జరుగనున్న లక్షెట్టిపేట, చెన్నూర్‌, క్యాతన్‌పల్లి, బెల్లంపల్లి మున్సిపాలిటీలలో ఓటింగ్‌ కోసం మొ త్తం 444 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రాన్ని 16 నుంచి 26 చదరపు గజాల వెడల్పు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఓటర్ల ఇంటి నుంచి క నీసం అర కిలోమీటరు నుంచి గరిష్టంగా ఒక కిలోమీటర్‌ లోపు పోలింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాల భవనాల తోపాటు కొన్ని చోట్ల ప్రైవేటు పాఠశాలల భవనాల్లోనూ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో గరిష్టంగా 800 మంది ఓటర్లను కేటాయించారు. మంచిర్యాల కార్పొరేషన్‌లో 1,81,778 మంది ఓటర్లకుగాను 265 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా, లక్షెట్టిపేటలో 18,358 మందికి 30 కేంద్రాలు ఏర్పాటు చేశారు. చెన్నూర్‌లో 19,903 మంది ఓటర్లకు 36 కేంద్రాలు, క్యాతన్‌పల్లిలో 29,785 మందికి 45 స్టేషన్లు, బెల్లంపల్లి మున్సిపాలిటీలో మొత్తం 44,575 మంది ఓటర్లకు 68 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఎన్నికల షెడ్యూల్‌ ఇలా....

మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల కాగా, ఈసీ నిర్ణయం మేరకు షెడ్యూల్‌ ఇలా ఉంది. ఈ నెల 28 నుంచి నామినేషన్‌ ప్రక్రియ ప్రారం భం కానుండగా ఇదే నెల 30వ తేదీన సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. 28వ తేదీన అన్ని మునిసిపాలిటీలలో వార్డుల వారీ ఓటర్ల జాబితాను రిట ర్నింగ్‌ అధికారులు ప్రదర్శించనున్నారు. 31వ తేదీన ఉ దయం 11 గంటలకు నామినేషన్ల పరిశీలన, అదే రోజు అభ్యర్థుల జాబితా విడుదల, ఫిబ్రవరి 1వ తేదీన తుది జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, 2వ తేదీన అభ్యంత రాల పరిష్కారం చేపట్టనుండగా, 3వ తేదీన నామినే షన్ల ఉపసంహరణ, అదే రోజు బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నారు. అలాగే 11వ తే దీన ఎన్నికల నిర్వహణ, 13వ తేదీన ఉదయం 8 గం టల నుంచి ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాలు విడు దల చేసి, విజేతలను ప్రకటించనున్నారు.

Updated Date - Jan 27 , 2026 | 10:49 PM