Share News

kumaram bheem asifabad- కక్ష సాధింపు రాజకీయాలు సరికాదు

ABN , Publish Date - Oct 01 , 2026 | 10:48 PM

కొంత మంది ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు అధికార పక్షానికి వత్తాసు పలుకుతూ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడడం సరికాదని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హితవు పలికారు. మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

kumaram bheem asifabad- కక్ష సాధింపు రాజకీయాలు సరికాదు
బెజ్జూరులో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కోనప్ప, పాల్గొన్న నాయకులు

బెజ్జూరు, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): కొంత మంది ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు అధికార పక్షానికి వత్తాసు పలుకుతూ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడడం సరికాదని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హితవు పలికారు. మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బెజ్జూరు సర్పంచ్‌ దుర్గం సరోజా బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలుపొందడంతో తనిఖీల పేరిట జిల్లా ఉన్నత స్థాయి అధికారి గ్రామపంచాయతీకి సంబంధించిన ఎంబీ రికార్డులు స్వాదీనం చేసుకొని కక్ష్య రాజకీయాలకు పాల్పడడం సరికాదన్నారు. ఏ అధికారంతో ఎంబీ రికార్డులు తీసుకున్నారని ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేసేందుకు ఎన్నుకోబడ్డ సర్పంచ్‌పై ఇలాంటి చర్యలు సరికాదని చెప్పారు. పార్టీ మారాలని ఒత్తిడితేగా, మారకపోవడంతో వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. అధికారం శాశ్వతం కాదని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. నిజాయితీ గల అధికారైతే నియోజకవర్గంలో ఎన్నో పంచాయతీల్లో అక్రమాలు జరుగుతున్నాయని, వాటిని ఎందుకు తనిఖీ చేయడం లేదని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని రైసుమిల్లుల్లో ఎందుకు తనిఖీలు చేయడం లేదన్నారు. ఇసుక దంద వంటి కార్యకలాపాలు జరుగుతున్నా వాటిపై ఎందుకు దృష్టి సారించడం లేదని అన్నారు. కక్ష సాధింపు రాజకీయాలకు భయపడేది లేదన్నారు. తమ వద్ద కూడా ఆదారాలు ఉన్నాయని త్వరలోనే వాటిని భయటపెడతామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు సరోజా, బానయ్య, కిరణ్‌, పీఏసీఎస్‌ చైర్మెన్‌ ఓంప్రకాష్‌, నాయకులు అమీరొద్దీన్‌, నరేందర్‌గౌడ్‌, షౌకత్‌అలీ, జావీద్‌అలీ, శ్రీనివాస్‌, సకరాం, తిరుపతి, హన్మంతు, ఇస్తారి, శేఖర్‌, దేవాజి, జాకీర్‌, సతీష్‌, జావీద్‌హుస్సేన్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2026 | 10:48 PM