మంచిర్యాల కేంద్రంగా రాజకీయం....
ABN , Publish Date - Jun 15 , 2026 | 11:32 PM
రాబోయే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని, మంచిర్యాల కేంద్రంగా తె లంగాణ రక్షణ సేన వేధికగా (టీఆర్‌ఎస్) రాజకీయం చే యబోతున్నామని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వ కుంట్ల కవిత ఆన్నారు.
-మూడు నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగురవేస్తాం
-మంచిర్యాల ఎమ్మెల్యే గుండా గిరి తగ్గించుకోవాలి
-సింగరేణి కార్మికుల ఆశీర్వాదం కోసమే బాయిబాట
-టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
మంచిర్యాల, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): రాబోయే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని, మంచిర్యాల కేంద్రంగా తె లంగాణ రక్షణ సేన వేధికగా (టీఆర్‌ఎస్) రాజకీయం చే యబోతున్నామని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వ కుంట్ల కవిత ఆన్నారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియో జక వర్గాల్లో పార్టీ జెండా ఎగురవేయబోతున్నామని జోస్యం చెప్పారు. జిల్లాలో రెండు రోజుల బాయిబాట కార్యక్రమం నిర్వహిస్తుండగా, మొదటి రోజైన సోమవారం జిల్లా కేంద్రం లోని ఎం కన్వెన్షన్ హాలులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మంచిర్యాల నుంచే బొగ్గుబాయి యాత్ర ప్రారంభించుకోవడం అనందం గా ఉందన్నారు. తెలంగాణలో ప్రాంతీయ పార్టీగా టీఆర్ ఎస్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. రైతులు, సింగరేణి కార్మి కులు, ఇలా ఎన్నో అంశాలపై మాట్లాడుతున్నట్లు తెలిపారు. గని కార్మికుల ఆశీర్వాదం కోసమే బాయిబాట కార్యక్రమం చేపట్టినట్లు కవిత తెలిపారు. సింగరేణిలో కార్మికులను తగ్గిం చే కుట్ర చేస్తున్నారని, ఓపెన్ కాస్టుల పేరుతో కార్మికులను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సింగరేణి కా ర్మికులు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని, ఉ ద్యోగ రక్షణ లేకుండా పోయిందనే అభద్రతా భావంలో ఉ న్నారన్నారు. కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, గుజ రాత్‌లో ఉన్న మాదిరిగా మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరే షన్ రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. ఓపెన్‌కాస్ట్ గనుల కంటే అండర్ గ్రౌండ్ గను లలోనే ఎక్కువ బొగ్గు ఉత్పత్తికి అవకాశం ఉందని, ప్రభు త్వం కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే మైన్స్, మినరల్స్ కలిపి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులైన కార్మికుల పిల్లలకు రూ. 20 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు రుణాలు ఇస్తామని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రెండు రోజులు మంచిర్యాల నియోజ క వర్గంలో పర్యటించి, ఒక్కసారైనా కార్మికులతో మాట్లాడారా...? అని ప్రశ్నించారు. బొగ్గు నిల్వల మాయంపై కాంగ్రెస్ వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని డి మాండ్ చేశారు. కిషన్‌రెడ్డి స్వయంగా బొగ్గుశాఖ మంత్రిగా ఉన్నందున మొదట కార్మికుల ఇన్‌కంటాక్స్ పెర్క్‌ను తీసే యాలని డిమాండ్ చేశారు. నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. మారుపేర్లుగల పేర్లుగల వారికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. టీఆర్‌ఎస్ బా యిబాట పోస్టర్ విడుదల చేయగానే ప్రతిపక్షం, అధికార పక్షంలో కదలిక వచ్చిందన్నారు. కార్మికులకు లాభాల వాటా ను గతంలో అత్యధికంగా ఇచ్చిన దానికంటే రూ. 10వేలు ఎక్కువ చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల వేతనం లో సగం ఇన్‌కంటాక్స్ చెల్లింపులకే పోతుందని, ఐటీ మిన హాయింపునివ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ 2012లో బోగ్గు స్కాంకు పాల్పడిందని, బ్లాకులను విక్రయించే ప్రయ త్నం చేసిందని ఆరోపించారు. రెండేళ్ల తరువాత అధికారం లోకి వచ్చిన బీజేపీ కోల్‌బ్లాక్‌లను జాతీయం చేసి, బయటో డు టెండర్లు వేసే పరిస్థితి తీసుకు వచ్చిందన్నారు.
ప్రత్యేకంగా హౌసింగ్ బోర్డు ఏర్పాటు చేస్తాం....
తాము అధికారంలోకి వచ్చిన తరువాత కార్మికుల కోసం ప్రత్యేకంగా హౌసింగ్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు కవిత తెలిపారు. సంస్థలో 30 ఏళ్లపాటు పని చేసి, క్వార్టర్లలో జీవి తం గడుపుతారని, రిటైర్ అయ్యాక సొంతింటి కోసం కార్మికు లు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. సొంతంగా ఇల్లు కట్టు కునేందుకు జిల్లా కేంద్రంలో 250 గజాల స్థలం ఇస్తామన్నారు.
కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 25 వేలు చెల్లించాలి...
మంచిర్యాల ఓసీపీల్లో కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 20వేల వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని, రామగుండంలో మాత్రం రూ. 25 వేలు ఇస్తున్నారన్నారు. అక్కడి ఎమ్మెల్యేలు కొట్లాడి ఎక్కువ వేతనం ఇప్పిస్తున్నారన్నారు. ఇక్కడి ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడంతోనే తక్కువ వేతనం లభిస్తోందన్నారు. కార్మికులకు కూడా న్యాయం చేయాలని పెద్దపల్లి ఎంపీ డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే గుండాగిరి తగ్గించుకోవాలి...
మంచిర్యాల ఎమ్మెల్యే గుండా గిరి రోజు రోజుకూ పెరుగు తోందని, గుండా గిరిని బంద్ చేయాలని ప్రేంసాగర్‌రావు ఉద్దేశించి సూచించారు. మంచిర్యాల పట్టణం రాళ్లవాగులో మునిగిపోతుంటే ప్రభుత్వం కరకట్టలు మంజూరు చేసిం దన్నారు. దాని కోసం రూ. 250 కోట్లు విడుదల చేసిందని, కాని కరకట్టలు అసంపూర్తిగా నిలిచిపోయాయన్నారు. ఆ నిధులు ఎక్కడికి పోయాయో తెలవదన్నారు. వెంటనే కరకట్టల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, మాజీ మంత్రి బోడ జనార్దన్, టీఆర్‌ఎస్ నాయకులు అరుణ్, చంద్రమోహన్ గౌడ్, సారయ్య, మనూజ, వరలక్ష్మి, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.