kumaram bheem asifabad-రాజకీయ పార్టీలు సహకరించాలి
ABN , Publish Date - Sep 01 , 2026 | 11:03 PM
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో మ్యాపింగ్ కానీ అనామలిస్ జాబితాలో గల ఓటర్లకు నోటీసులు జారీ చేసి నిర్వహించే హియరింగ్ ప్రక్రియకు రాజకీయపార్టీల ప్రతినిధులు తమ సహకారం అందించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐఆర్ ప్రక్రియలో మ్యాపింగ్ కానీ అనామలిస్ జాబితాలో గల ఓటర్లకు నోటీసులు జారీ చేసి నిర్వహించే హియరింగ్ ప్రక్రియకు రాజకీయపార్టీల ప్రతినిధులు తమ సహకారం అందించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హియరింగ్ ప్రక్రియకు సంబంధిత ఓటర్లు హాజరై అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించేలా రాజకీయపార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. బూత్‌స్థాయి ఏజెంట్లు ప్రక్రియలో భాగస్వాములు అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైన ధ్రువపత్రాలతో పాటు నివాస ధ్రేవపత్రాలు తహసీల్దార్ కార్యాలయం నుంచి త్వరగా జారీ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నోటీసులో సూచించిన తేదీ సమయానికి సంబంధిత ఓటరు హాజరై రుజువు పత్రాలు సమర్పించి ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సహకరించాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, డీఆర్వో వేణు, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, రాజకీయపార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐఆర్‌లో భాగంగా అనామలిస్ జాబితా మ్యాపింగ్ కానీ ఓటర్లకు గడువులోగా నోటీసులు అందజేసి హియరింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో చేపడుతున్న హియరింగ్ ప్రక్రియ, నోటీసులు, రిజిష్ట్రర్లు, ఓటర్లకు అందిస్తున్న ధ్రువపత్రాలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లకు నిర్ణీత గడువులోగా నోటీసులు అందజేసి హియరింగ్ ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. సంబందిత నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి అవసరమైన ధ్రువపత్రాలను స్వీకరించి బూత్‌స్థాయి అధికారి యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. బూత్‌స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి నోటీసులు అందజేసి ఓటర్ల నుండి రశీదులు తీసుకోవాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకూడదని చెప్పారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రియాజ్‌ఆలీ, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.