Share News

kumaram bheem asifabad- రాజకీయ పార్టీలు సహకరించాలి

ABN , Publish Date - Jan 28 , 2026 | 11:03 PM

మున్సిపల్‌ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కె హరిత అన్నారు. రెండో సాధారణ మున్సిపల్‌ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం రెండో సాధారణ మున్సిపల్‌ ఎన్నికలపై నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి కె.హరిత, ఎస్పీ నితికా పంత్‌, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి పాల్గొన్నారు.

kumaram bheem asifabad- రాజకీయ పార్టీలు సహకరించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ కె హరిత

ఆసిఫాబాద్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సంపూర్ణ సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కె హరిత అన్నారు. రెండో సాధారణ మున్సిపల్‌ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం రెండో సాధారణ మున్సిపల్‌ ఎన్నికలపై నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి కె.హరిత, ఎస్పీ నితికా పంత్‌, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని ముందుస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఆసిఫాబాద్‌లో 20 వార్డులు 28 పోలింగ్‌ కేంద్రాలు, కాగజ్‌నగర్‌లో 30 వార్డులు 85 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేయడంతో పాటు నామినేషన్‌ కేంద్రాల వద్ద హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ బృందాలు నిరంతరం విధులు నిర్వహిస్తున్నాయన్నారు. మున్సిపాలిటీల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు చర్యలు చేపట్టడంతో పాటు పోలింగ్‌ కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులు, ఎన్నికల సామగ్రి పంపిణీ, స్ట్రాంగ్‌ రూం, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కంట్రోల్‌రూం నంబరు 8500844365 ద్వారా ఫిర్యాదులు, సమస్యలను తెలియజేయవచ్చన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ నితికా పంత్‌ మాట్లాడుతూ పోలింగ్‌కు ముందు, పోలింగ్‌ రోజు, పోలింగ్‌ అనంతరం, అలాగే కౌంటింగ్‌ రోజున పూర్తి స్థాయి బందో బస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నేర చరిత్ర కలిగిన వారిపై బైండోవర్‌ చర్యలు చేపడుతామని అన్నారు. ఓటర్లకు భద్రతా ముప్పు కలిగించే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాల న్నారు. పోలీసు హెల్ప్‌ లైన్‌ నంబరు 8571267050 ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. సమావేశంలో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

ఆసిఫాబాద్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): రెండో సాధారణ మున్సిపల్‌ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ భవనంలో ఎస్పీ నితికా పంత్‌, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. ఈ నెల 28 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరణ, 31న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 1వ తేదీన అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ, 2న అభ్యంతరాల పరిష్కారం ఉంటుందని చెప్పారు. 3న నామినేషన్‌ ఉపసంహరణ అనంతరం అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, 9వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారం నిలుపుదల ఉంటుందని తెలిపారు. 11న పోలింగ్‌, 13న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో 20 వార్డులకు 28 పోలింగ్‌ కేంద్రాలు, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో 30 వార్డులకు 85 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీకి 2 స్టాటిస్టిక్‌, 1 ప్లయింగ్‌ సర్వేయలెన్స్‌ బృందాలు, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీకి 2 స్టాటిస్టిక్‌, 1 ఫ్లయింగ్‌ సర్వేయలెన్స్‌ బృందాలు పని చేస్తున్నాయని తెలిపారు. నామినేషన్లు స్వీకరించేందుకు రిటర్నింగ్‌ అధికారులను నియమించామని అన్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రశాంతంగా జరిగేలా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ( 8500844365)ని ఏర్పాటు చేశామన్నారు. 24 గంటల పాటు పని చేస్తుందని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లు, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. స్ట్రాంగ్‌ రూం, కౌటింగ్‌ కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లు, ప్రతి పోలింగ్‌ కేంద్రాలలో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాలలో వీడియో గ్రఫీ ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ప్రశాంత వాతవరణంలో జరిగే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్పీ నితికా పంత్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికలకు బందో బస్తు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు, పోలింగ్‌ ముందు, పోలింగ్‌ రోజు, కౌంటింగ్‌ రోజు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందో బస్తు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. జిల్లాలో 30 పోలీసు యాక్ట్‌ అమలులో ఉందని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు ఫ్లాగ్‌మార్చ్‌ చేపడుతామని తెలిపారు. నామినేషన్‌ కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. ర్యాలీలు, సభల కోసం అనుమతుల కోసం 48 గంటల ముందే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రచారంలో వినియోగించే లౌడ్‌ స్పీకర్లకు ఎస్‌డీపీవోల వద్ద అనుమతి పొందాలన్నారు. లైసెన్స్‌డ్‌ అయుధాలు కలిగిన వారు తిరిగి డిపాజిట్‌ చేయాలని చెప్పారు. వివరాలకు స్పెషల్‌ బ్రాంచి ఇన్స్‌పెక్టర్‌ (8712670505) సంప్రదించాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పూర్తి స్థాయిలో బందో బస్తు ఏర్పాటు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2026 | 11:03 PM