Share News

మహిళలు, విద్యార్థుల రక్షణకు పోలీస్‌శాఖ ప్రత్యేక చర్యలు

ABN , Publish Date - Jun 07 , 2026 | 12:11 AM

మహిళలు, బాలికలు, విద్యార్ధినిల రక్షణకు పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మహేష్‌ బీగీతే పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమా వేశంలో ఎస్పీ మాట్లాడుతూ గడి చిన ఐదు నెలల్లో షీటీంకు వచ్చిన ఫిర్యాదులలో14 ఎఫ్‌ఐఆర్‌లతో పాటు 16 పెట్టి కేసులు నమోదు చేసి

 మహిళలు, విద్యార్థుల రక్షణకు   పోలీస్‌శాఖ ప్రత్యేక చర్యలు

సిరిసిల్ల అర్బన్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): మహిళలు, బాలికలు, విద్యార్ధినిల రక్షణకు పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మహేష్‌ బీగీతే పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమా వేశంలో ఎస్పీ మాట్లాడుతూ గడి చిన ఐదు నెలల్లో షీటీంకు వచ్చిన ఫిర్యాదులలో14 ఎఫ్‌ఐఆర్‌లతో పాటు 16 పెట్టి కేసులు నమోదు చేసి మహిలలను విద్యార్థినిలను వేధిస్తున్న వారిని గుర్తించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళలు, విద్యార్థినిలు, బాలికలు వేధింపులకు గురైనప్పుడు వెంటనే ఒక ఫోన్‌ కాల్‌ చేస్తే మీకు రక్షణ కవచంలా జిల్లా షీ టీం సిద్ధంగా ఉంటుం దన్నారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థినిలు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని, సామాజిక మాద్యమాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం వుండాలని సూచించారు.జిల్లాలో షీ టీం బృందం విద్యాసంస్థల్లో, మహిళలు పనిచేసే ప్రదేశాల్లో, రద్దీ ప్రాంతాల్లో విద్యా ర్థులకు, మహిళలకు, ర్యాగింగ్‌, ఈవ్‌టీజింగ్‌, పోక్సో, సోషల్‌ మీడి యా మోసాలు, మహిళా చట్టాలపై విస్తృతంగా అవగాహన కార్యక్ర మాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో షీటీం బృందం నిత్యం మఫ్టీలో నిఘా ఉంచి మహిళలను, విద్యార్థినిలను వేధించే ఆకతాయిలను అదుపులోకి తీసుకొని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారని అన్నారు. సమస్య ఎదురైనపుడు షీ టీం ఫోన్‌ నెంబర్‌ 8712656425లో ఫిర్యాదు చేయాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

బహిరంగ ప్రదేశాల్లో

మద్యం సేవిస్తే కఠిన చర్యలు

సిరిసిల్ల అర్బన్‌, జూన్‌ 6 (ఆంఽధ్రజ్యోతి): జిల్లాలో నేరాల నియం త్రణే లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టడంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ మహేష్‌ బీగీతే అన్నారు. సిరిసిల్ల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తం గా శుక్రవారం రాత్రి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 84 మందిని గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితులల్లోనే సహించబోమని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ఇటువంటి ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే ప్రాంతాలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో మరింత సమర్ధవంతంగా పెట్రోలింగ్‌ నిర్వహిస్తు న్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.

Updated Date - Jun 07 , 2026 | 12:11 AM