Share News

ప్రజలకు మరింత చేరువగా పోలీస్‌ వ్యవస్థ

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:51 PM

ప్రజలకు మరింత చేరువగా పోలీసింగ్‌ను అమలు చేస్తున్నామని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కన్నెపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోలీస్‌ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు.

ప్రజలకు మరింత చేరువగా పోలీస్‌ వ్యవస్థ
కన్నెపల్లి పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో నాటిన మొక్కకు నీరు పోస్తున్న డీజీపీ శివధర్‌రెడ్డి

-రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి

కన్నెపల్లి, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు మరింత చేరువగా పోలీసింగ్‌ను అమలు చేస్తున్నామని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కన్నెపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోలీస్‌ స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, బెల్లంపల్లి ఎ మ్మెల్యే గడ్డం వినోద్‌, రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా, మల్టీ జోన్‌ 1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, డీసీపీ భాస్కర్‌, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్‌ లు డీజీపీకి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. పోలీసుల గౌ రవ వందనం స్వీకరించారు. అనంతరం డీజీపీ నూతన పోలీస్‌స్టేషన్‌ లో ఎస్‌ఐ భాస్కర్‌రావును కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భం గా డీజీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలకు మరింత చేరువగా ఉండి మెరుగైన సైవలందించేందుకు అత్యాధునిక పో లీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. ప్రజా రక్షణలో సాంకేతికతను వి నియోగించి భద్రతను కట్టుదిట్టం చేస్తామన్నారు. పోలీసులు విధుల పట్ల అంకిత భావంతోపనిచేయాలని, ప్రతి నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నా రు. శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేయాలన్నారు. ప్రజ లతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నా రు. ప్రజలకు సైబర్‌ మోసాలు,మూఢన్మకాలు, రోడ్డు భద్రతపై విస్తృ తంగా అవగాహన కల్పించాలని సూచించారు. అసాంఘీక కార్యకలాపా లకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. అనంతరం పోలీ స్‌స్టేషన్‌ ఆవరణలో అధికారుల తో కలిసి డీజీపీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ మనో జ్‌, తాండూర్‌ సీఐ దేవయ్య, స్థానిక సర్పంచు గడ్డల జయలక్ష్మీ వెంకటేష్‌, గొల్లగట్టు సర్పంచు నెండుగూరి వెంకన్న, కాంగ్రెస్‌ నాయకులు నర్సిం గరావు, రామాంజనేయులు, పోలీసులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2026 | 11:51 PM