Share News

ప్రజలకు పోలీసు భరోసా కల్పించాలి

ABN , Publish Date - Feb 24 , 2026 | 11:20 PM

పోలీసుస్టేషన్‌కు సమస్య తో వచ్చిన వారికి మేము ఉన్నాం అని భరోసా కల్పించేలా పోలీసులు వ్యవహరించారని సాంకేతిక ఆధారాలతోనే నేరాలను నియంత్రించవ చ్చునని రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు.

ప్రజలకు పోలీసు భరోసా కల్పించాలి
సమీక్ష సమావేశంలో హాజరైన పోలీసు అదికారులు, సిబ్బంది

సాంకేతిక ఆధారాలతోనే నేరాల నియంత్రణ

రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా

మంచిర్యాలక్రైం, ఫిబ్రవరి24 (ఆంధ్రజ్యోతి): పోలీసుస్టేషన్‌కు సమస్య తో వచ్చిన వారికి మేము ఉన్నాం అని భరోసా కల్పించేలా పోలీసులు వ్యవహరించారని సాంకేతిక ఆధారాలతోనే నేరాలను నియంత్రించవ చ్చునని రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు. జనవరి నెలవారి నేర సమీక్ష సమావేశంలో భాగంగా రామగుండం పో లీసు కమిషనర్‌ కార్యాలయంలో ఆయన పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌పో లీసు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమా వేశానికి పెద్దపల్లి డీసీపీ అడిషనల్‌ అడ్మిన్‌ ఏసీపీలు, ఎస్‌ఐలు, స్టేష నల్‌, డివిజన్‌ జోన్‌వారిగా పెండింగ్‌ కేసుల స్థితిగతులను నేరస్తుల అరె స్టులు, దర్యాప్తు పురోగతి సాక్ష్యాధారాల సేకరణ, చార్జీషీట్ల దాఖలుపై ఆయన సమీక్షించారు. ముఖ్యంగా గ్రేవ్‌ కేసులు, మహిళలపై నేరాలు, ఆస్తి నేరాలు, ఫోక్సో, మిస్సింగ్‌, గంజాయి రోడ్డు ప్రమాదాల కేసులపై ప్రత్యేక దృష్టి సారించి గతంలో జరిగిన లోపాలు, భవిష్యత్‌లో కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన కేసులపై అధికారులతో చర్చించా రు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ దర్యాప్తు నాణ్యతను మెరుగుప రుచడంతో పాటు కేసుల పరిష్కార శాతాన్ని పెంచాలని సూచించారు. పాత కేసులు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రత్యేక కార్యచ రణ ప్రణాళికలతో త్వరిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి కేసును పారదర్శకంగా వేగంగా పూర్తి చేసి బాధితులకు న్యాయం అందించాలని సూచించారు. మహిళలై నేరాలకు సంబంధించిన కేసుల్లో సాక్ష్యాధారాలు కోర్టులో బలంగా సమర్పించి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ ప్రతి కేసులో ఉన్నతా ధికారుల పర్యవేక్షణ ఉండాలని దర్యాప్తు నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టా లని సంఘటన స్థలాన్ని సందర్శించి ఫిర్యాదులోఉన్న అంశాలపై సమగ్ర విచారణ చేసి సాక్ష్యాధారాలను సేకరించి ప్రతి అంశాన్ని వీడియో రి కార్డింగ్‌ చేయాలన్నారు. గంజాయి, డ్రగ్స్‌ వంటి చట్ట విరుద్ద కార్యకలా పాలపై కమిషనరేట్‌లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే పదోతరగతి, ఇంటర్‌ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్‌ 144 అమలులో ఉంటుందని పోలీసు స్టేషన్‌ నుంచి ప్రశ్నాపత్రా లను కేంద్రాలకు తీసుకెల్లడం పరీక్ష అనంతరం జవాబు పత్రాలు తిరిగి తీసుకరావడం వరకు భద్రత కల్పించాలని, పరీక్ష కేంద్రాల వద్ద బందో బస్తు ఉన్న పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్ర మంలో అడిషనల్‌ డీసీపీ కే. శ్రీనివాస్‌, ఏసీపీలు ఎం. రమేశ్‌, ఆర్‌. ప్రకాశ్‌, జి. క్రిష్ణ, రవి కుమార్‌, వెంకటేశ్వర్‌, వెంకటరంగా రెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 11:20 PM