Share News

kumaram bheem asifabad- విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Apr 04 , 2026 | 11:03 PM

పోలీసు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నితికా పంత్‌ అన్నారు. తిర్యాణి పోలీసు స్టేషన్‌ను శనివారం ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌ పరిసరాలు, నమోదు చేసిన రికార్డులు, పెండింగ్‌ కేసుల పురోగతి, స్టేషన్‌ హాజరు రిజిస్టర్‌, సేష్టన్‌ శుభ్రత తదితర విభాగాలను పరిశీలించారు.

kumaram bheem asifabad- విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
ఎస్సైకి సూచనలు చేస్తున్న ఎస్పీ నితికా పంత్‌

తిర్యాణి, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): పోలీసు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నితికా పంత్‌ అన్నారు. తిర్యాణి పోలీసు స్టేషన్‌ను శనివారం ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌ పరిసరాలు, నమోదు చేసిన రికార్డులు, పెండింగ్‌ కేసుల పురోగతి, స్టేషన్‌ హాజరు రిజిస్టర్‌, సేష్టన్‌ శుభ్రత తదితర విభాగాలను పరిశీలించారు. ఎస్‌హెచ్‌వో వెంకటేష్‌కు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు సిబ్బంది ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. గ్రామాల్లో చట్ట వ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, మాదకద్రవ్యాలపై దృష్టి సారించాలని అన్నారు. మండల కేంద్రం, గ్రామాల్లో చోరీల నియంత్రణకు వ్యాపారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. శాంతి భద్రతల విషయంలో రాత్రి వేళ పర్యవేక్షణ, పెట్రోలింగ్‌ను కచ్చితంగా కొనసాగించాలని సూచించారు. ప్రజా భద్రతకు విఘాతం కలిగించే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Updated Date - Apr 04 , 2026 | 11:03 PM