Share News

kumaram bheem asifabad- గంజాయి సాగుపై పోలీసుల ఉక్కుపాదం

ABN , Publish Date - Oct 07 , 2026 | 10:45 PM

జిల్లాలో అక్రమ గంజాయి సాగుపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లాను గంజాయి రహితంగా మార్చటమే లక్ష్యంగా పోలీసులు శాఖ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ నితికాపంత్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ బి.ఆశోక్‌ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా లింగాపూర్‌, సిర్పూరు(యు), కెరమెరి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

kumaram bheem asifabad- గంజాయి సాగుపై పోలీసుల ఉక్కుపాదం
లోగో

కెరమెరి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అక్రమ గంజాయి సాగుపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లాను గంజాయి రహితంగా మార్చటమే లక్ష్యంగా పోలీసులు శాఖ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ నితికాపంత్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ బి.ఆశోక్‌ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా లింగాపూర్‌, సిర్పూరు(యు), కెరమెరి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా సాగు చేస్తున్న 500 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.50లక్షల ఉంటుందని పోలీసులు ప్రకటించారు. గంజాయి సాగుకు పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులపై ఆరు కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. గతేడాది జిల్లాలో అక్రమ గంజాయి సాగుకు సంబంఽ దించిన 39 కేసులు నమోదు చేసి 35 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1,134 గంజాయి మొక్కలను స్వాఽధీనం చేసుకొని రూ.1.13 కోట్ల విలువైన మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ సాగులో పాల్గొన్న భూ యాజమానుల్లో 20 మందికి కలెక్టఱ్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని నిలిపివేశారు.

- ఈ ఏడాది జిల్లాలో..

ఈ ఏడాది జిల్లాలో ఇప్పటి వరకు 23 కేసులు నమోదు కావడం విశేషం. ఇందులో కూడా 27 మందిని అరెస్టు చేశారు. రూ.2.36 కోట్ల విలువైన 2,366 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. డ్రై గంజాయిపైనా నిఘా డ్రై గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిం చారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళా శాలల్లో గంజాయితో ఏర్పడే అనర్థాలపై పోలీసులు శాఖ ప్రత్యేక సమావేశాలను విస్తృతంగా చేపట్టారు. యువకులు పెడ తోవ పట్టకుండా ఉండేం దుకు పోలీసులు చేపడుతున్న వివిధ కార్యక్రమాలు ఫలితాన్ని ఇస్తున్నాయి. జిల్లాలో గిరిగ్రామాలపై కూడా పోలీసులు పక్కా నిఘా పెట్టారు. ఎక్కడ గంజాయి సాగు చేసిన కూడా ఎవరిని ఉపేక్షించేది లేదని ఖరాఖండిగా పోలీసులు పేర్కొంటున్నారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ నితిక పంత్‌ను వివరణ కోరగా జిల్లాలో గంజాయి రహిత సమాజం కోసం కృషి చేస్తున్నామన్నారు. ఎవరు కూడా గంజాయి సాగు చేయరాదని చెప్పారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తెచ్చి అమ్మకాలు జరిపితే కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశామని చెప్పారు. మారుమూల గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించామని వివరించారు. గంజాయి సాగు చేస్తే ఎంతటి వారిపైన తప్పకుండా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. గంజాయి రహిత సమాజం ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

Updated Date - Oct 07 , 2026 | 10:45 PM