Share News

కేటీఆర్‌పై పోలీసు కేసు

ABN , Publish Date - May 07 , 2026 | 05:04 AM

బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి కేటీఆర్‌పై వరంగల్‌లోని సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ..

కేటీఆర్‌పై పోలీసు కేసు

హనుమకొండ టౌన్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి కేటీఆర్‌పై వరంగల్‌లోని సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అందిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి తదితరులు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ను బుధవారం కలిసి కేటీఆర్‌పై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సీపీ ఆదేశాల మేరకు బీఎన్‌ఎస్‌ సెక్షన్‌లు 504, 505 కింద కేటీఆర్‌పై కేసు నమోదు చేశామని సుబేదారి సీఐ మేకల రంజిత్‌కుమార్‌ వెల్లడించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, అసత్య ప్రచారం చేయడం వంటి నేరాలు ఈ సెక్షన్ల కిందకు వస్తాయి.

Updated Date - May 07 , 2026 | 05:04 AM