Share News

రచయిత్రి పోలాప్రగడ రాజ్యలక్ష్మి కన్నుమూత

ABN , Publish Date - Feb 24 , 2026 | 05:34 AM

సీనియర్‌ రచయిత్రి పోలాప్రగడ రాజ్యలక్ష్మి(90) ఇకలేరు. వయసురీత్యా తలెత్తిన అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఏఎ్‌సరావు నగర్‌లోని ఓ...

రచయిత్రి పోలాప్రగడ రాజ్యలక్ష్మి కన్నుమూత

  • అస్సాం ఉద్యమం నేపథ్యంలో రాసిన‘రెల్లుపొదలు’ నవలకు విశేష ఆదరణ

  • ఆక్స్‌ఫర్డ్‌ సంపుటిలో కవితలకు చోటు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): సీనియర్‌ రచయిత్రి పోలాప్రగడ రాజ్యలక్ష్మి(90) ఇకలేరు. వయసురీత్యా తలెత్తిన అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఏఎ్‌సరావు నగర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుం బ సభ్యులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో 1936 ఫిబ్రవరి 5న జన్మించారు. ఆమె భర్త పోలాప్రగడ సత్యనారాయణమూర్తి కూడా రచయితే. ఆయన కొంతకాలం కిందట కన్నుమూశారు. పోలాప్రగడ దంపతులకు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. అస్సాం ఉద్యమం ఇతివృత్తంగా రాజ్యలక్ష్మిరాసిన ‘రెల్లు పొదలు’ నవల ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. కేంద్రసాహిత్య అకాడమీ కోసం రచయిత్రి కనుపర్తి వరలక్ష్మమ్మపై మోనోగ్రాఫ్‌ రాశారు. ‘ఏమైనా సరే! కథరాయాలి’ శీర్షికన 1964లో ప్రచురించిన కథతో సాహిత్య సృజన ప్రారంభించిన రాజ్యలక్ష్మి.. 25కు పైగా నవలలు, 150కుపైగా కథలు, కవిత్వం, వ్యాసాలు రాశారు. ఆమె కవితలు ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ ప్రచురించిన ప్రత్యేక సంపుటిలో ప్రచురితమయ్యాయి. ఆమె సాహిత్యంపై ఆచార్య నాగార్జున, ఆంధ్రా, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో ఎంఫిల్‌, పీహెచ్‌డీ పరిశోధనలు జరిగాయి.

Updated Date - Feb 24 , 2026 | 05:34 AM