Share News

kumaram bheem asifabad- ఘనంగా పొలాల అమావాస్య

ABN , Publish Date - Sep 10 , 2026 | 10:41 PM

జిల్లాలో గురువారం పొలాల అమావాస్యను రైతులు ఘనంగా నిర్వహించారు. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో గురువారం పొలాల అమవాస్య వేడుకలను రైతులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. అన్నదాతకు సాగులో తొడుండే బసవన్నలను ప్రత్యేకంగా అలంకరించి పూలదండలు, గజ్జెలతో ముస్తాబు చేసి బసవన్నలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు.

kumaram bheem asifabad- ఘనంగా పొలాల అమావాస్య
వాంకిడిలో హనుమాన్‌ ఆలయం వద్ద ఎద్దులకు పూజలు చేస్తున్న రైతులు

ఆసిఫాబాద్‌/వాంకిడి/బెజ్జూరు/సిర్పూర్‌(టి)/సిర్పూర్‌(యు)/కెరమెరి/కౌటాల/దహెగాం/చింతలమానేపల్లి/ సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం పొలాల అమావాస్యను రైతులు ఘనంగా నిర్వహించారు. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో గురువారం పొలాల అమవాస్య వేడుకలను రైతులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. అన్నదాతకు సాగులో తొడుండే బసవన్నలను ప్రత్యేకంగా అలంకరించి పూలదండలు, గజ్జెలతో ముస్తాబు చేసి బసవన్నలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. పట్టణంలోని దశ్నాపూర్‌ నుంచి బసవన్నల శోభాయాత్ర ప్రారంభం కాగా కోర్టు రోడ్డు, కుమరంభీంచౌక్‌, అంబేద్కర్‌చౌక్‌, గాంధీచౌక్‌ల మీదుగా కొనసాగింది. అనంతరం అంకంరాజు ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొని రైతులతో కలసి నృత్యాలు చేశారు. ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకొకుండా, ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీఐ నీలం రవి ఆధ్వర్యంలో ఎస్సైలు, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అనిల్‌, మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఆకాష్‌, ఆహ్మద్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మంగ, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఆలీబీన్‌ ఆహ్మద్‌, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీ శ్యాంనాయక్‌, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్‌, కౌన్సిలర్లు చిలువేరి వెంకన్న, కార్తీక్‌, బాలకృష్ణ, గోవింద్‌, బీజేపీ నాయకులు విశాల్‌, కాంగ్రెస్‌ నాయకులు తారీఖ్‌, మురళీ, నిజాం, ఇమ్రాన్‌, అనుమాండ్ల సాయి, బీఆర్‌ఎస్‌ నాయకులు అశోక్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ మారుతి పటేల్‌ తదితరులు పాల్గొన్నారు. వాంకి డి మండలంలో ఉదయాన్నే రైతులు ఎద్దులను శుభ్రంగా కడిగి రంగు రంగులతో అలంకరించారు. సాయంత్రం మండల కేంద్రంలోని హనుమాన్‌ ఆలయం వద్ద బసవన్నలను ప్రదక్షిణలు చే యించి ప్రత్యేక పూజలు చేశారు. బెజ్జూరులోని ఆయా గ్రామాల్లో రపశువులను వివిధరకాల రంగులతో అలంకరించారు. సాయంత్రం గ్రామాల్లోని ఆలయాలు, గ్రామదేవతల ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ఎద్దులతో ఊరేగింపు నిర్వహించారు. సిర్పూరు(టి) మండలంలో పొలాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎద్దులకు అలంకరణ చేశారు. అనంతరం బెల్లంపానకాన్ని తాగించారు. పెద్దబండ వాగులో, పేట్‌మహిళలోని హనుమాన్‌ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. సిర్పూర్‌(యు), మండలంలో పొలాల అమావాస్య పండుగను గురువారం రైతులు,గ్రామీణులు ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు,సర్పంచ్‌ ఆత్రం ఓంప్రకాష్‌, ఆత్రం సన్మాన్‌రావు,కనక శ్యాంరావు, కనక నాగోరావు, తోడసం యదవ్‌రావు, గోడం అమృత్‌రావు, కోట్నాక పాండురంగ్‌, గోడం సీతారాం, మెస్రం రాంచందర్‌, మదేవడ్‌ దత్తు, మదేవడ అనిల్‌కుమార్‌, ఉత్తం, వెడ్మ భరత్‌ తదితరులు పాల్గొన్నారు. కెరమెరి మండలంలో పొలాల అమావాస్య పండుగ పర్వదినాన్ని జరుపుకున్నారు. రైతులు ఉదయాన్నే తమ ఎద్దులను సమీపంలోకి వాగుల్లో కడిగి అనంతరం ప్రత్యేకంగా అలంకరించారు. ఆయా గ్రామాల్లోని అంజనేయ స్వామి ఆలయాల ఆవరణలో తమ తమ ఎడ్లతో ఊరేగింపు నిర్వహించారు. కౌటాల మండల వ్యాప్తంగా పొలాల అమవాస్య పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమీపంలో వాగుల్లో ఎడ్లకు స్నానం చేయించారు. అనంతరం రంగు రంగులతో పూలతో అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. దహెగాం మండలంలో పొలాల అమవాస్య పండుగను ఘనంగా నిర్వహించారు. ఎద్దులను రంగు రంగులతో పూలతో అలంకరించి పూజలు చేశారు. చింతలమానేపల్లిలో గురువారం పొలాల అమవాస్య పండుగను ఘనంగా రైతులు నిర్వహించారు. ఉదయం నుంచి రైతులు తమ ఎద్దులను శుభ్రం చేసి రంగు రంగులతో తయారు చేశారు. అనంతరం మండల కేంద్రంలో ఊరేగింపును తీశారు. పల్లెల్లో పండుగ వాతావరణం కనిపించింది.

Updated Date - Sep 10 , 2026 | 10:41 PM