Share News

రిక్రియేషన్‌ పేరుతో పేకాట...!

ABN , Publish Date - May 08 , 2026 | 10:58 PM

మంచిర్యాల జి ల్లా కేంద్రంలోని హైటెక్‌సిటీ కాలనీ సమీపంలో ఉన్న మంచిర్యాల క్లబ్‌లో జోరుగా పేకాట ఆడుతున్నా సం బంధిత అధికారులు పట్టించుకోకపోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. రిక్రియేషన్‌ పేరిట నిర్వహిస్తున్న క్లబ్‌లో పేకాటే ప్రధానంగా కార్యకలాపాలు సాగుతున్నాయి.

రిక్రియేషన్‌ పేరుతో పేకాట...!
. హైటెక్‌సిటీలోని మంచిర్యాల క్లబ్‌

-మంచిర్యాల క్లబ్‌లో జోరుగా జూదం

-సభ్యత్వం పేరుతో భారీగా వసూలు

-చిద్రమవుతున్న జీవితాలు

-పోలీసుల దాడులతో వెలుగులోకి

మంచిర్యాల, మే 8 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జి ల్లా కేంద్రంలోని హైటెక్‌సిటీ కాలనీ సమీపంలో ఉన్న మంచిర్యాల క్లబ్‌లో జోరుగా పేకాట ఆడుతున్నా సం బంధిత అధికారులు పట్టించుకోకపోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. రిక్రియేషన్‌ పేరిట నిర్వహిస్తున్న క్లబ్‌లో పేకాటే ప్రధానంగా కార్యకలాపాలు సాగుతున్నాయి. మంచిర్యాల క్లబ్‌లో జిమ్‌, స్వి మ్మింగ్‌ పూల్‌, షటిల్‌ కోర్టులు ఉన్నప్పటికీ అవన్నీ కే వలం చూడటానికే పరిమితం అవుతున్నాయి. సొసైటీ క్లబ్‌లో ప్రధానంగా పేకాటకే ప్రాధాన్యం ఇస్తారు. ఇది లా ఉండగా అసలు మంచిర్యాల క్లబ్‌లో సభ్యత్వమే హోదాగా భావించే స్థితికి వచ్చిందంటే అతశయోక్తికాదు. ఇక్కడ సభ్యత్వం పొందాలంటే పెద్ద మొత్తంలో రుసుం చెల్లించాల్సి ఉంటుంది. క్లబ్‌కు అనుసంధానం గా మద్యం కూడా అందుబాటులో ఉండటంతో పే కా ట ఆడుతూ మధ్యం సేవించడం ఇక్కడ నిత్యకృత్యం అవుతోంది. ఇందులో రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, రియల్‌ ఎస్టేట్‌, వడ్డీ వ్యాపారులు సభ్యులుగా ఉన్నారు. ఇక్కడ పేకాట నిత్యం కృత్యమన్న విష యం గతంలో రామగుండం కమిషనరేట్‌ పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో వెలుగులోకి వచ్చింది.

సభ్యత్వం కాస్ట్‌లీ గురూ....

మంచిర్యాల క్లబ్‌లో సభ్యత్వం అతి ఖరీదైంది. డబ్బు లు కట్టగలిగే సామర్థ్యం ఉంటే చాలు....ఎలాంటి అర్హత లేకపోయినా ఇక్కడ సభ్యత్వం తీసుకోవచ్చు. సభ్యత్వం తీసుకొనే వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత జీవితం ఇక్క డ అనవసరం. ఎలాంటి వారైనా పర్వాలేదు....డబ్బులు చెల్లించగల స్తోమత ఉంటే చాలు ఇక్కడ సభ్యత్వం పొందవచ్చు. ప్రస్తుతం మంచిర్యాల క్లబ్‌లో సభ్యత్వం తీసుకోవాలంటే రుసుం కింద రూ. 1. 5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. పేకాట వ్యసనం ఉన్నవారు స్తోమత లేకపోయినా ఫైనాన్స్‌ల్లో అప్పులు తెచ్చి మరీ సభ్యత్వం తీసుకుంటారని వినికిడి. మంచిర్యాల క్లబ్‌లో ప్ర స్తుతం 700కుపైగా సభ్యులు ఉన్నారు. ఇలా సభ్యత్వానికి లక్షలు చెల్లించి, పేకాటలో నష్టాలు వచ్చి రోడ్డున పడ్డవారు అనేక మంది ఉంటారని ప్రచారంలో ఉంది. సంపన్నుల సంగతి పక్కన బెడితే మేకపోతు గాంబీ ర్యం ప్రదర్శించి ఉన్నది పోగొట్టుకున్న వారే ఇక్కడ అధికంగా ఉన్నట్లు సమాచారం. కాగా లక్షలు పెట్టి సభ్య త్వం తీసుకొని క్లబ్‌లో పేకాట ఆడి, తమ బతుకులను చిద్రం చేసుకున్నవారే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.

నిబంధనలకు పాతర...

రిక్రియేషన్‌ పేరిట కొనసాగుతున్న మంచిర్యాల క్లబ్‌లో రమ్మీ పేరిట జూదం ఆడుతుంటారని సమాచా రం. ఒక్కో గేమ్‌కు రూ. 3 వేల చొప్పున చెల్లిస్తూ, పెద్ద మొత్తంలో పేకాట రాయుళ్లు డబ్బులు పోగొట్టుకుంటారని తెలుస్తోంది. ప్రతి రోజు దాదాపు 100 మంది వర కు ఇక్కడ పేకాట ఆడుతుంటారు. వీటికి అధనం గా సభ్యులకు నిర్వాహకులు రిక్రియేషన్‌ టూర్‌లు ఏర్పా టు చేస్తుంటారు. క్లబ్‌ తరుపున ఏర్పాటు చేసిన టూ ర్లలో సభ్యులు తమ వెంట పెద్ద ఎత్తున మద్యం బా టిళ్లు తీసుకెళ్తూ ఇతర రాష్ట్రాల పోలీసులకు పట్టుబడ్డ సంఘటనలు ఉన్నాయి. ప్రతి రోజు సాయంత్రం అ యిందంటే చాలు వందలాది మంది ఇక్కడ మద్యం సేవిస్తూ పేకాట ఆడటం ఆనవాయితీగా వస్తోంది. నే రుగా డబ్బులు టేబుల్‌పై ఉంచకుండా కాయిన్‌లు ఉ పయోగిస్తూ పేకాట ఆడుతూ ఉంటారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లబ్‌ల్లో పే కాటను నిశేధించింది. అప్పటి నుంచి క్లబ్బుల్లో పేకా ట నిలిచిపోయినప్పటికీ మంచిర్యాల క్లబ్‌లో మాత్రం రమ్మీ పేరుతో లక్షల పెట్టుబడితో జూదం కొనసాగుతుండటం గమనార్హం.

పోలీసుల మెరుపు దాడులు...

రామగుండం కమిషనరేట్‌ పోలీసులు 2019 జూన్‌ లో మంచిర్యాల క్లబ్‌పై మెరుపు దాడులు నిర్వహించి, పేకాట ఆడుతున్న 36 మందిని అరెస్టు చేశారు. దా డుల సందర్భంగా పేకాట రాయుళ్ల నుంచి పోలీసులు రూ. 6. 21 లక్షల నగదుతోపాటు 237 కాయిన్‌లను స్వాధీనం చేసుకున్నారు. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాలలో ఏకకాలంలో దాడులు నిర్వహించగా మంచిర్యాల క్లబ్‌లో అక్రమంగా సాగుతున్న పేకాట బాగోతం బట్టబయలైంది. దశాబ్దాల కాలంగా క్లబ్‌ను నిర్వాహకులు రిక్రియేషన్‌ పేరిట నడుపుతూ అక్రమ దందాను కొనసాగిస్తున్నట్లు పోలీస్‌ దాడుల్లో వెల్లడైంది. అంతకు ముందు కూడా పలుమార్లు మంచిర్యాల క్లబ్‌పై పోలీసుల దాడులు జరిగాయి. దాడులు జరిగినప్పుడల్లా కొంతకాలం స్తబ్దంగా ఉండే కార్యకలాపాలు ఆదును చూసి మళ్లీ పునరుద్దరిస్తాయి. ఇటీవల రెండు, మూడు నెలల క్రితం నుంచి క్లబ్‌లో పేకాట మళ్లీ ఊపందుకో గా, ప్రతి రోజూ లక్షల్లో చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - May 08 , 2026 | 10:58 PM