Share News

kumaram bheem asifabad- అటవీశాఖ కార్యాలయం ఎదుట పోడు రైతుల ధర్నా

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:17 PM

జిల్లాలో పోడు భూముల సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్‌ చేస్తూ ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని జిల్లా అటవీ శాఖ కార్యాలయం ఎదుట మంగళవారం పోడు రైతులు భారీ ధర్నా నిర్వహించారు. రైతులకు ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మద్దతు తెలిపారు. ధర్నాలో పాల్గొని రైతులతో కలిసి నినాదాలు చేశారు. మా భూములు మాకే కావాలని, మేము చనిపోయినా సరే మా భూమిలోనే చస్తామని, మేము రైతులం, దేశానికి అన్నం పెట్టే రైతులం, మా భూములను లాక్కోవడం కంటే మమ్మల్ని అందరిని ఇక్కడే చెట్లకు ఉరి తీయండి అంటూ నినాదాలు చేశారు.

kumaram bheem asifabad- అటవీశాఖ కార్యాలయం ఎదుట పోడు రైతుల ధర్నా
అటవీశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న పోడు రైతులు, పాల్గొన్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పోడు భూముల సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్‌ చేస్తూ ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని జిల్లా అటవీ శాఖ కార్యాలయం ఎదుట మంగళవారం పోడు రైతులు భారీ ధర్నా నిర్వహించారు. రైతులకు ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మద్దతు తెలిపారు. ధర్నాలో పాల్గొని రైతులతో కలిసి నినాదాలు చేశారు. మా భూములు మాకే కావాలని, మేము చనిపోయినా సరే మా భూమిలోనే చస్తామని, మేము రైతులం, దేశానికి అన్నం పెట్టే రైతులం, మా భూములను లాక్కోవడం కంటే మమ్మల్ని అందరిని ఇక్కడే చెట్లకు ఉరి తీయండి అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోడు భూముల సమస్యలను గుర్తించి లక్షాది ఎకరాలకు పట్టాలు ఇచ్చారని అన్నారు. రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాల్లో రైతులకు అండగా నిలిచారన్నారు. తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న గిరిజన, ఆదివాసీ రైతులకు అన్యాయం జరగనివ్వమని అన్నారు. సర్వే పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని, విత్తనాలు వేసుకునే సీజనల్‌లో ఆటంకాలు కలించవద్దని అటవీ అధికారులకు సూచించారు. రైతులకు న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 11:17 PM