Share News

kumaram bheem asifabad-కలెక్టరేట్‌ ఎదుట పోడు రైతుల ధర్నా

ABN , Publish Date - Jul 07 , 2026 | 11:13 PM

కెరమెరి మండలం సూర్థపూర్‌ గ్రామానికి చెందిన పోడు రైతులు కలెక్టరేట్‌ ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. పోడు రైతులకు మద్దతుగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టరేట్‌ ఎదుట పోడు రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వర్షానికి కూడ లెక్క చేయకుండా ఎమ్మెల్యే పోడు రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం కలెక్టరేట్‌లోకి వెళ్లెందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక త నెలకొంది.

kumaram bheem asifabad-కలెక్టరేట్‌ ఎదుట పోడు రైతుల ధర్నా
డీఎఫ్‌వో బాలామణికి వినతిపత్రం ఇస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి

- పోడు రైతులకు న్యాయం చేయాలని డీఎఫ్‌వోకు వినతి

ఆసిఫాబాద్‌రూరల్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): కెరమెరి మండలం సూర్థపూర్‌ గ్రామానికి చెందిన పోడు రైతులు కలెక్టరేట్‌ ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. పోడు రైతులకు మద్దతుగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టరేట్‌ ఎదుట పోడు రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వర్షానికి కూడ లెక్క చేయకుండా ఎమ్మెల్యే పోడు రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం కలెక్టరేట్‌లోకి వెళ్లెందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక త నెలకొంది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దశాబ్దలుగా సాగు చేసుకుంటున్న పోడు భూమిలో అటవీశాఖ అధికారులు కందకాలు తవ్వడం అన్యాయమన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఏనాడు పోడు రైతులకు ఇబ్బంది పెట్టలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం అక్కడి నుంచి డీఎఫ్‌వో కార్యాలయానికి చేరుకున్నారు. డీఎఫ్‌వో బాలామణితో మాట్లాడారు. 50 ఏళ్లుగా సాగు చేస్తున్న రైతులకు భూములను అప్పగించాలని కోరారు. ఈ వానాకాలంలో సీజన్‌లో సాగుకు అవకాశం కల్పించాలని చెప్పారు. వచ్చే ఏడాది రెవెన్యూ, అటవీశాఖ అధికారుల చేత సంయుక్త సర్వే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఎఫ్‌వోకు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాష్‌, వైస్‌ చైర్మన్‌ ఆహ్మద్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, పార్టీ మండల అధ్యక్షుడు రవిందర్‌, మాజీ ఎంపీపీ కలాం, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకురాలు సరస్వతి పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2026 | 11:13 PM