Share News

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

ABN , Publish Date - Oct 16 , 2026 | 05:02 AM

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.18 వేల జరిమానా విధిస్తూ సిద్దిపేట మొదటి అదనపు జిల్లా న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు
conviction

నంగునూరు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.18 వేల జరిమానా విధిస్తూ సిద్దిపేట మొదటి అదనపు జిల్లా న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. నిందితుడు బండి భాస్కర్‌ (27).. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలానికి చెందిన బాలికను ప్రేమ పేరుతో అపహరించి, లైంగికదాడికి పాల్పడినట్లు 2022లో రాజగోపాలపేట పోలీస్‌ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. అప్పటి ఎస్సై మహిపాల్‌ రెడ్డి, ఏసీపీ దేవారెడ్డి దర్యాప్తు చేపట్టి, పటిష్టమైన సాక్ష్యాధారాలతో కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. సాక్షుల వాంగ్మూలాలు, సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి వై. జయప్రసాద్‌ నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ శిక్ష ఖరారు చేశారు.

Updated Date - Oct 16 , 2026 | 05:03 AM