Share News

పోచమ్మవాడ పాఠశాలకు జాతీయ గుర్తింపు

ABN , Publish Date - May 11 , 2026 | 06:32 AM

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో... ‘పొగాకు రహిత విద్యాసంస్థలు/ పాఠశాలలు..సవాళ్లు’ అనే అంశంపై దేశవ్యాప్తంగా జరిగిన పోటీలో...

పోచమ్మవాడ పాఠశాలకు జాతీయ గుర్తింపు

యాదాద్రి, మే 10 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో... ‘పొగాకు రహిత విద్యాసంస్థలు/ పాఠశాలలు..సవాళ్లు’ అనే అంశంపై దేశవ్యాప్తంగా జరిగిన పోటీలో... యాదగిరిగుట్ట పట్టణంలోని పోచమ్మవాడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉత్తమ బహుమతిని సాధించింది. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఆన్‌లైన్‌లో జరిగిన ఈ పోటీల్లో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలపై పలు కార్యక్రమాలను చేపట్టి, ఆ వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. తెలంగాణలో మొత్తం మూడు పాఠశాలలు ఉత్తమ బహుమతులు గెలుచుకున్నాయి. ఈ నెల 29వ తేదీన ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఎస్‌.నారాయణ కేంద్ర ప్రభుత్వం నుంచి జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందుకోనున్నారు.

Updated Date - May 11 , 2026 | 06:34 AM