Share News

పోలీసుల అదుపులో పీఎంజే దోపిడీ నిందితులు..?

ABN , Publish Date - May 12 , 2026 | 04:36 AM

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలర్స్‌లో బంగారు ఆభరణాల దోపిడీ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

పోలీసుల అదుపులో పీఎంజే దోపిడీ నిందితులు..?

కరీంనగర్‌ క్రైం, మే 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలర్స్‌లో బంగారు ఆభరణాల దోపిడీ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దోపిడీకి పాల్పడిన నిందితుల్లో ఒకరు పశ్చిమ బెంగాల్‌కు వెళ్లి అక్కడి నగల వ్యాపారికి బంగారు ఆభరణాలు విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కాగా సమాచారం అందింది. ఆ ప్రాంతంలో ముందుగానే నిఘా పెట్టిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో అతడు ఇచ్చిన సమాచారం మేరకు మరో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరో నిందితుడి కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపును ముమ్మరం చేశాయి. అతడు కూడా ఒకటి రెండు రోజుల్లో పట్టుబడే అవకాశమందని తెలిసింది. కాగా, దొంగలను పట్టుకున్న సమాచారాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు.

Updated Date - May 12 , 2026 | 04:36 AM