పట్టణ ప్రాంతాల్లో 18,213 ఇండ్లకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Mar 11 , 2026 | 05:12 AM
ప్రధానమంత్రి ఆవాస యోజన (పీఎంఏవై.యు) అర్బన్ 2.0 పథకం కింద తెలంగాణలోని 118 పట్టణ ప్రాంతాల్లో 18,213 ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది...
పీఎంఏవై అర్బన్ 2.0 కింద రూ.273కోట్ల మంజూరుకు అనుమతి
హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి గౌతమ్
హైదరాబాద్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ఆవాస యోజన (పీఎంఏవై.యు) అర్బన్ 2.0 పథకం కింద తెలంగాణలోని 118 పట్టణ ప్రాంతాల్లో 18,213 ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కేంద్రం.. ఇళ్లని ర్మాణానికి కేంద్ర వాటా కింద రాష్ట్రానికి మంజూరు చేయాల్సిన రూ.273 కోట్ల నిధుల విడుదలకూ అనుమతినిచ్చింది. పీఎంఏవై అర్బన్ 2.0 పథకంపై ఢిల్లీలో నిర్వహించిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమి టీ(సీఎ్‌సఎంసీ) సమావేశంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తు తం తెలంగాణలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రభు త్వం ఇంటిని మంజూరు చేస్తోంది. ఇంటి నిర్మాణానికి నాలుగు దశల్లో రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 118 పట్టణ ప్రాంతాల్లో రూ.910.65కోట్ల (కేంద్రం వాటా రూ.273.20 కోట్లు, రాష్ట్రం వాటా రూ.637.45కోట్లు) అంచనా వ్యయంతో 18,213 ఇళ్లను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై హౌసింగ్ కార్పొరేషన్ దృష్టి సారించిందని, ఆయా పనులు వేగవంతం కానున్నాయని ఆ సంస్థ ఎండీ వి.పి గౌతమ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.