kumaram bheem asifabad- పీఎంశ్రీ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
ABN , Publish Date - Mar 18 , 2026 | 11:08 PM
ప్రధానమంత్రి శ్రీ పాఠశాలలను ఆదర్శంగా తీర్చి దిద్దాలని కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్, ప్రధాన మంత్రి శ్రీ పాఠశాలల కేంద్ర నోడల్ అధికారి అమిత్ కటోచ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో బుధవారం కలెక్టర్ కె హరిత, అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాకులు సత్యనారాయణ రెడ్డి, జిల్లా విద్యాధికారిణి లలితతో కలిసి ఎంఈవో, ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి శ్రీ పాఠశాలలను ఆదర్శంగా తీర్చి దిద్దాలని కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్, ప్రధాన మంత్రి శ్రీ పాఠశాలల కేంద్ర నోడల్ అధికారి అమిత్ కటోచ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో బుధవారం కలెక్టర్ కె హరిత, అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాకులు సత్యనారాయణ రెడ్డి, జిల్లా విద్యాధికారిణి లలితతో కలిసి ఎంఈవో, ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి మాట్లాడుతూ జిల్లాలో 18 ప్రధాన మంత్రి శ్రీ పాఠశాలల్లో మ్యాథ్స్, సైన్స్ సర్కిల్ పెంచాలని, విద్యార్థులను క్షేత్రస్థాయి సంఘర్షణలకు తీసుకెళ్లాలని, విద్యార్థులకు ఎకో క్లబ్, నృత్యాలు, సంగీతం పరికరాల వినియోగం, అటల్ టెంకరింగ్ ల్యాబ్, ఒకేషనల్ ఎడ్యూకేషన్, కంప్యూటర్ ఎడ్యూకేషన్ నేర్పించాలని తెలిపారు. ప్రధాన మంత్రి శ్రీ పాఠశాలల్లో మౌలిక వసతులు, అదనపు గదుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. కలెక్టర్ కెహరిత మాట్లాడుతూ జిల్లాలో 18 ప్రధాన మంత్రి శ్రీ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మౌలిక వసతులు, అదనపు గదుల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపొందించే విధంగా చర్యలు చేపడుతున్నామని, కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి శ్రీ పాఠశాలలో చేపట్టే కార్యక్మరమాలను అధికారుల సమన్వయంతో అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమన్వయకర్త సతీష్, దేవాజీ, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
కెరమెరి, (ఆంధ్రజ్యోతి): కెరమెరి మండలం సావర్‌ఖేడ ఎంపీపీఎస్ పాఠశాలను బుధవారం పీఎం శ్రీ కేంద్ర పరిశీలకులు అమిత్ కటోచ్ పరిశీలించారు. ప్రైమతీ తరగతుల గదులను పరిశీలించి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాదానాలు రాబట్టారు. 4, 5వ తరగతి విద్యార్థులచే కలిసి పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు, విద్యార్థుల సౌకర్యాలను అడిగి తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం వంట గది, కిచెన్ గార్డెన్, హెర్బల్ గార్డెన్, క్రీడా పరిసరాలు పరిశీలించారు. పాఠశాలకు గ్రామస్తుల సహకారాన్ని అభినందించారు. ఆయన వెంట ఆర్‌జేడీ సత్యనారాయణరెడ్డి, డీఈవో లలిత, ఎంఈవో ప్రకాష్ ఉన్నారు.