Share News

త్వరలో పీఎం రహత్‌ అమలు

ABN , Publish Date - Apr 14 , 2026 | 05:12 AM

కేంద్ర ప్రభుత్వ ‘పీఎం రాహత్‌’ పథకం కింద త్వరలో రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత చికిత్స అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు....

త్వరలో పీఎం రహత్‌ అమలు

  • గోల్డెన్‌ అవర్‌లో క్షతగాత్రుడిని ఆస్పత్రిలో చేరిస్తే రూ.25 వేల ప్రోత్సాహకం: మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ ‘పీఎం రాహత్‌’ పథకం కింద త్వరలో రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత చికిత్స అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన గంట (గోల్డెన్‌ అవర్‌)లో బాధితుల్ని ఆస్పత్రిలో చేర్పించిన వారికి.. రహవీర్‌ పథకం రూ.25వేల నగదు ప్రోత్సాహకం అందిస్తున్నామన్నారు. ఈ పథకం కింద ఒక వ్యక్తి ఏడాదిలో 5సార్లు ప్రోత్సాహం అందుకోవచ్చునన్నారు. ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో అరైవ్‌-అలైవ్‌ కార్యక్రమాల పోస్టర్‌, కరపత్రాన్ని ఆయన ఆవిష్కరిస్తూ ఆయన మాట్లాడారు. ఈ నెల 18 వరకూ వారం పాటు ‘అరైవ్‌-అలైవ్‌’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదాల కారక రోడ్లు, ప్రాంతాల్ని గుర్తించి భద్రతా చర్యలు చేపడతామన్నారు. కాగా, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనకు ఫోన్‌ చేయలేదని పొన్నం స్పష్టం చేశారు. బిల్లుల కోసం మంత్రికి ఫోన్‌ చేసినా ఎత్తడం లేదని పోచారం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఎవరు ఫోన్‌ చేసినా తాను లిప్ట్‌ చేస్తానన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 05:12 AM