వచ్చే నెల్లో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన?
ABN , Publish Date - Apr 25 , 2026 | 07:31 AM
ప్రధాని మోదీ వచ్చే నెల మొదటివారంలో రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఆయన పర్యటన దాదాపు ఖరారైందని, ఏ రోజు వస్తారన్నది స్పష్టత రావాల్సి ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : ప్రధాని మోదీ వచ్చే నెల మొదటివారంలో రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఆయన పర్యటన దాదాపు ఖరారైందని, ఏ రోజు వస్తారన్నది స్పష్టత రావాల్సి ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా మోదీ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో భాగంగా కొన్ని జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం జింఖానా గ్రౌండ్సులో నిర్వహించే బహిరంగసభలో ప్రధాని పాల్గొంటారు. మోదీ పర్యటనపై నేడో, రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి.