మే 9న రాష్ట్రానికి ప్రధాని మోదీ
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:37 AM
వచ్చే నెల 9న ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా పలు జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు....
హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): వచ్చే నెల 9న ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా పలు జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రాజెక్టుల జాబితా సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమం అనంతరం హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసే సభలో మోదీ పాల్గొంటారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలిసారి రాష్ట్రానికి వస్తుండడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.