Share News

‘వై నాట్‌ తెలంగాణ’

ABN , Publish Date - May 11 , 2026 | 05:56 AM

దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు బీజేపీనే గెలుస్తోందన్నారు.

‘వై నాట్‌ తెలంగాణ’

  • ఈ నినాదంతోనే రాష్ట్రానికి మోదీ: లక్ష్మణ్‌

హైదరాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు బీజేపీనే గెలుస్తోందన్నారు. బెంగాల్‌, అస్సాం, పుదుచ్చేరిలలో గెలిచామని, ఇప్పుడు ‘వై నాట్‌ తెలంగాణ’ అనే పిలుపుతో ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్‌కు వస్తున్నారని బీజేపీ నేత లక్ష్మణ్‌ అన్నారు. మోదీపై ప్రజల్లో ఉన్న విశ్వాసమే బీజేపీని గెలిపిస్తోందన్నారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ తెలంగాణను దోచుకుందన్న భావనతో ప్రజలు కాంగ్రెస్ కు అవకాశమిచ్చారని అన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ‘పెనం నుంచి పొయ్యిలో’ పడినట్లు ఉందన్నారు. బీఆర్‌ఎస్-కాంగ్రెస్‌ తోడు దొంగలుగా వ్యవహరిస్తున్నాయన్నారు. తెలంగాణకు ప్రధాని రూ.వేలకోట్లతో పలు ప్రాజెక్టులను మంజూ రు చేశారన్నారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ గ్యారెంటీ అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోరుకునే ప్రతీ వ్యక్తి తమతో కలిసిరావాలని పిలుపునిచ్చారు. వారికి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని, అవినీతిని పారదోలుతామన్నారు. కాగా కాంగ్రెస్‌ అంటే.. కరప్షన్‌, కమీషన్‌, కమ్యూనలిజం అన్నారు. తెలంగాణలోనూ ఆ పార్టీ ఒక వర్గానికి కొమ్ము కాస్తోందన్నారు.

Updated Date - May 11 , 2026 | 05:57 AM