Share News

మోదీ రికార్డు హర్షణీయం: రాంచందర్‌రావు

ABN , Publish Date - Mar 23 , 2026 | 06:40 AM

దేశంలో ప్రభుత్వాధినేతగా సుదీర్ఘకాలం సేవలందించిన నేతగా ప్రధాని మోదీ చారిత్రక మైలురాయి అధిగమించడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు చెప్పారు.

మోదీ రికార్డు హర్షణీయం: రాంచందర్‌రావు

  • మోదీ అంకితభావానికి నిదర్శనం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 22(ఆంధ్రజ్యోతి): దేశంలో ప్రభుత్వాధినేతగా సుదీర్ఘకాలం సేవలందించిన నేతగా ప్రధాని మోదీ చారిత్రక మైలురాయి అధిగమించడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు చెప్పారు. ప్రభుత్వాధినేతగా సిక్కిం మాజీ సీఎం పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ పేరిట ఉన్న 8930 రోజుల రికార్డును మోదీ అధిగమించారు. ఈ సందర్భంగా రాంచందర్‌ మాట్లాడుతూ మోదీ జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేశారని ప్రశంసించారు. మోదీ ప్రభుత్వం ప్రతీ వర్గానికీ అభివృద్ధి ఫలాలను అందిస్తోందన్నారు. ప్రభుత్వాధినేతగా సృష్టించిన రికార్డు, ప్రజా సేవపై మోదీ అంకితభావానికి అద్దం పడుతుందని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. మోదీ నిస్వార్థ సేవ, ఆయన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిందన్నారు. ప్రజల కోసం పనిచేయాలన్న మోదీ తపన ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తెలిపారు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశసేవలో నిమగ్నమైపోవడం ఆయన అంకితభావానికి నిదర్శనమన్నారు.

Updated Date - Mar 23 , 2026 | 06:41 AM