Share News

డిగ్రీ విద్యార్థులకు పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీం

ABN , Publish Date - Apr 02 , 2026 | 03:30 AM

డిగ్రీలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ, బీఫార్మసీ, బీటెక్‌ చివరి సంవత్సరం, పీజీలో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంసీఏ, ఎంటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్న ...

డిగ్రీ విద్యార్థులకు పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీం

  • ప్రకటించిన తెలంగాణ ఉన్నత విద్యామండలి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి) : డిగ్రీలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ, బీఫార్మసీ, బీటెక్‌ చివరి సంవత్సరం, పీజీలో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంసీఏ, ఎంటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ స్కాలర్‌షిప్‌ పథకాన్ని ప్రకటించింది. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 12 లక్షలలోపు ఉన్న విద్యార్థులు ఈ పథకంలో దరఖాస్తు చేసుకొనేందుకు అర్హులు. ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ. 9 వేల చొప్పున స్కాలర్‌షిప్‌ అందిస్తారని తెలంగాణ ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య బాలకిస్టారెడ్డి తెలిపారు. పరిశ్రమల శాఖ కమిషనర్‌ నిఖిల్‌ చక్రవర్తి సమక్షంలో బుధవారం విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పథకం కరపత్రికను విడుదల చేశారు. విద్యార్థి వయస్సు 18-25 మధ్యలో ఉండాలి. తప్పనిసరిగా పదో తరగతి, ఇంటర్‌/ఐటీఐ/పాలిటెక్నిక్‌ పూర్తిచేసుకుని డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులని అన్నారు. విద్యార్థులు ‘ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ స్కీం’ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు ఫోన్‌ నెంబరు 1800116090పై సంప్రదించాలని కోరారు.

Updated Date - Apr 02 , 2026 | 03:30 AM