kumaram bheem asifabad- ఆహ్లాదం.. ఆనందం..
ABN , Publish Date - Mar 27 , 2026 | 10:45 PM
సిర్పూర్ (టి) రేంజ్ పరిధిలోని రిజర్వు ఫారెస్టు అయిన ఇటిక్యా ల పహాడ్ గ్రామ పరిసరాలు చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గ్రామం నుంచి వెయ్యి ఎకరాల విస్తీర్ణం గల ఎడారి భూముల్లో గత 2019-20 సంవత్సర కాలం నుంచి ప్రతి సంవత్సరం అటవీ శాఖ అధికారులు కొన్ని కోట్ల నిధులతో మొక్క పెంపకం అనే లక్ష్యంతో ప్రతి వర్షకాలం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో నాటిన మొక్కలు నేడు పెద్ద పెద్ద వృక్షాలు ఎదిగి దట్టమైన అటవీ ప్రాంతాలుగా మారాయి
- వన్యప్రాణులకు ప్రత్యేక నీటి వనతి
సిర్పూర్(టి), మార్చి 27 (ఆంధ్రజ్యోతి): సిర్పూర్ (టి) రేంజ్ పరిధిలోని రిజర్వు ఫారెస్టు అయిన ఇటిక్యా ల పహాడ్ గ్రామ పరిసరాలు చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గ్రామం నుంచి వెయ్యి ఎకరాల విస్తీర్ణం గల ఎడారి భూముల్లో గత 2019-20 సంవత్సర కాలం నుంచి ప్రతి సంవత్సరం అటవీ శాఖ అధికారులు కొన్ని కోట్ల నిధులతో మొక్క పెంపకం అనే లక్ష్యంతో ప్రతి వర్షకాలం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో నాటిన మొక్కలు నేడు పెద్ద పెద్ద వృక్షాలు ఎదిగి దట్టమైన అటవీ ప్రాంతాలుగా మారాయి. దీంతో పాటు ఈ అటవీకి ఆనుకొని ఉన్న మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి పులులతో పాటు వన్యప్రాణులు సైతం వస్తుంటాయి. వీటి రక్షణ, దాహార్తి కోసం సోలార్ బోర్‌లు, నీటి కుంటలను సైతం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే పులుల ఆవాసం కోసం ప్రత్యేక బేక్ క్యాంపులకు రక్షణ కవచంలా నిర్మాణం చేపట్టి వాటిని ఎలాంటి హాని కలగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఇటు చెట్లు ఏపుగా పెరిగి మరో వైపు వన్యప్రాణి రక్షణ సులువుగా జరుగుతున్నది. ఏదీ ఏమైనప్పటికీ సిర్పూర్(టి) రేంజ్ అధికారులు పట్టువదలకుండా ఇటిక్యాలపహాడ్ గ్రామాన్ని రానున్న రోజుల్లో పర్యాటక కేంద్రంగా మార్చేలనే లక్ష్యంతో కృషి చేస్తున్నారు. దీనితో తోటు ప్రతి రెండు మూడు నెలలకోసారి ఈ అటవీ ప్రాంతానికి రాష్ట్రా, జిల్లా స్థాయి అధికారులు సందర్శించి మరింత అభివృద్ధి అయ్యేలా సిబ్బందికి సూచనలు సలహాలు ఇస్తున్నారు. దీంతో గ్రామం ఒక అటవీ వనంలా అభివృద్ధి చెందుతుంది.
వన్యప్రాణి రక్షణకు ప్రజలు సహకరించాలి..
- ప్రవీణ్, ఎఫ్‌ఆర్వో
సిర్పూర్(టి) రేంజ్ పరిధిలో వన్యప్రాణి రక్షణ,, అడవుల అభివృద్ధికి గ్రామస్తులు సహకరించాలి. రానున్న రోజుల్లో ఇటిక్యాలపమాడ్ అటవీ ప్రాంతాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మార్చాలన్న దృడసంకల్పంతో రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు సైతం అటవీ సంపదను కాపాడు కునే బాధ్యత అందరిపై ఉంది. వారి సహకారం ఎంతో అవసరం. ఈ దిశగా వారికి అవగాహన కల్పిస్తున్నాం.