Share News

kumaram bheem asifabad- సర్‌ ప్రక్రియకు సహకరించాలి

ABN , Publish Date - Jul 10 , 2026 | 10:27 PM

జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు

kumaram bheem asifabad- సర్‌ ప్రక్రియకు సహకరించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ కెహరిత, పాల్గొన్న అధికారులు

ఆసిఫాబాద్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్యుమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 50 శాతం ఎన్యుమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తి అయిందని, మిగితా 50 శాతం చేయాల్సి ఉందని తెలిపారు. జిల్లాలోని కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలలో ప్రక్రియ కొంత నెమ్మదిగా సాగుతుందని రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ బూత్‌ స్థాయి ఏజెంట్లతో మాట్లాడి ప్రక్రియ నిర్వహణలో చురుకుగా పాల్గొనేలా సహకరించాలని తెలిపారు. బూత్‌ స్థాయి అధికారులకు సహయంగా పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ వీఓఏలు, చదువుకున్న యుఏవత సహకరిస్తున్నారని ఈ నెల 20వ తేదీ వరకు డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేసే విధంగా అధికారులతో మమేకమై పని చేయాలని తెలిపారు. ఓటర్ల నుంచి నింపిన ఎర్యూమరేషన్‌ ఫారాలు బూత్‌ స్థాయి అధికారులకు అందేలా కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

భూముల రీ సర్వేను పక్కాగా చేపట్టాలి..

జిల్లాలోని రెవెన్యూ గ్రామాల నక్షాలు లేని గ్రామాలను గుర్తించి భూములను రీ సర్వే చేసి గ్రామ నక్షాలు రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ కె.హరిత అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, సర్వే లాండ్‌ రికార్డ్‌ ఏడీ వినయ్‌లతో కలిసి సర్వే శాఖ అధికారులతో భూముల రీ సర్వేపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాఆ్లడుతూ జిల్లాలో రెవెన్యూ నక్షాలు లేని గ్రామాలను గుర్తించడం జరిగిందని, భూములు రీ సర్వే ద్వారా రైతులకు మేలు కలుగుతుందని, భవిష్యత్‌లో ఎలాంటి వివాదాలు ఉండవదని తెలిపారు. భూముల సర్వే నిర్వహించే ముందు గ్రామ సభలు నిర్వహించి రైతులతో సమావేశం కావాలని, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా సర్వే పనులు పక్కాగా నిర్వహించాలని, అవసరమైన పరికరాలు సమకూర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2026 | 10:27 PM