Share News

లక్ష్యం మేరకు మొక్కలు పెంచాలి

ABN , Publish Date - Apr 30 , 2026 | 11:12 PM

ప్రభుత్వ లక్ష్యం మేరకు మొక్కలు పెంచి లక్ష్యాన్ని సాధించాలని డీఆర్‌డీవో చిన్న ఓ బులేష్‌ సూచించారు.

లక్ష్యం మేరకు మొక్కలు పెంచాలి
ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతున్న డీఆర్‌డీవో చిన్న ఓబులేష్‌

- డీఆర్‌డీవో చిన్న ఓబులేష్‌

తిమ్మాజిపేట, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ లక్ష్యం మేరకు మొక్కలు పెంచి లక్ష్యాన్ని సాధించాలని డీఆర్‌డీవో చిన్న ఓ బులేష్‌ సూచించారు. తిమ్మాజి పేట మండలంలోని గుమ్మకొండ, ఎదిరేపల్లి, తిమ్మాజిపేట గ్రామ పంచాయతీలల్లో నర్సరీలను, ఉపాధి హామీ ప థకంలో భాగంగా కొనసాగుతున్న పనులను ప రిశీలించి కూలీలతో మాట్లాడి వసతులను అ డిగి తెలుసుకున్నారు. ఎండలు అధికంగా ఉన్నా యని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలన్నా రు. పొద్దున్నే పనులకు రావాలని త్వరగా ఇంటి కి వెళ్లాలన్నారు. కూలీల సంఖ్య పెంచడంతో పాటు మొక్కలు పెంచాలని ఉపాధి హామీ సి బ్బందికి సూచించారు. ఏపీవో సత్యనా రాయణ, టీఏ బాలరాజు, తాజుద్దీన్‌ పాల్గొన్నారు.

ఉపాఽధిహామీ పనులను పరిశీలించిన ఏపీడీ

ఉప్పునుంతల, (ఆంధ్రజ్యోతి):మండల పరిధి లోని దాసర్లపల్లి, ఉప్పునుంతల, అయ్యవారిపల్లి గ్రామాలలో ఉపాధిహామీ పనులను ఏపీడీ శ్రీ నివాసులు పరిశీలించారు. గ్రామపంచాయతీల లో తక్కువ మందికి కూలీలకు పనులు కల్పిస్తు న్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్ర మంలో ఎంపీడీవో వరుణ్‌తేజ పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2026 | 11:12 PM