kumaram bheem asifabad- వనమహోత్సవానికి మొక్కలు సిద్ధం
ABN , Publish Date - Jun 04 , 2026 | 10:41 PM
రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమానికి అధికారులు సిద్ధం చేస్తున్నారు. 12వ విడతలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేశారు. వానలు కురవడమే ఆలస్యం.. మొక్కలు నాటేం దుకు డీఆర్‌డీఏ, ఇతర శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు
- పకడ్బందీగా చేపట్టేందుకు అధికారుల ప్రణాళికలు
ఆసిఫాబాద్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమానికి అధికారులు సిద్ధం చేస్తున్నారు. 12వ విడతలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేశారు. వానలు కురవడమే ఆలస్యం.. మొక్కలు నాటేం దుకు డీఆర్‌డీఏ, ఇతర శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ స్థలాలు, రహదారులకు ఇరువైపు లా, పొలం, చెరువు గట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలు, కమ్యూనిటీ కేంద్రా లు, వైద్యశాలలు, కళాశాలలు, పాఠశాలల ఆవరణ లో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటు న్నారు. అలాగే ప్రజలు, రైతులు అడిగిన మొక్కలు ఇవ్వడానికి సైతం అధికారులు సిద్ధం చేస్తున్నారు.
- పచ్చదనం పెంచడమే..
రాష్ట్రంలో పచ్చదనం పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ఏటా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపడుతోంది ఇందులో భాగంగానే ఈఏడాది కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేం దుకు కార్యాచరణ రూపొందించింది. గత ప్రభుత్వం తెలంగాణకు హరితహరం పేరుతో తొమ్మిది విడతలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదో విడతనుంచి వనమహోత్సవం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోం ది.. ఈ సారి 12 విడతలో వన మహోత్పవాన్ని ఉత్సా హంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల భాగ స్వామ్యంతో జిల్లా గ్రామీణాభివృద్ధి, ఇతర శాఖల అధికారుల ఆధ్వర్యంలో జూలై మొదటి వారంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
- జిల్లా వ్యాప్తంగా..
జిల్లాలో 12వ విడత వన మహోత్పవం కార్యక్ర మంలో భాగంగా 15 మండలాలలోని 334 గ్రామపంచాయతీల్లో 51 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఇందులో అన్ని శాఖలను భాగస్వామ్యం చేయనున్నారు. ఈ సారి డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 32,64, 997 మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ఇతర అన్ని శాఖల ఆధ్వ ర్యంలో మిగితా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
శాఖల వారీగా..
జిల్లాలోని 15 మండలాలల్లోని 334 గ్రామపంచా యతీల్లో 51 లక్షల మొక్కలు నాటా లని లక్ష్యంగా నిర్ధేశించారు. ఇందులో డీఆర్‌డీఏ శాఖ ఆధ్వర్యంలో 32,64,997 మొక్కలు నాటాలని నిర్ణయించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో 7,47,000, ఆర్‌అండ్‌బీ ఆధ్వ ర్యంలో 10,000, ఇరిగేషన్ శాఖ ద్వారా 30,000 మొక్కలు నాటనున్నారు. వ్యవసాయ, ఇతర అను బంధ సంఘాలు ఆధ్వర్యంలో 65,000, రెవెన్యూ 62,000 మొక్కలు, మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెం ట్ 4,26,000 ద్వారా మొక్కలు నాటను న్నారు. పొలీస్ శాఖ ద్వారా 14,000 మొక్కలు, విద్యాశాఖ ఆధ్వర్యంలో 45,000, పశుసంవర్థక శాఖ, మత్సశాఖ ద్వారా 10,000 మొక్కలు, ఇండస్ట్రీయల్ శాఖ ఆధ్వర్యంలో 5000 మొక్కలు, మైన్స్ ,గ్రౌండ్ వాటర్ 23,000 మొక్కలు , ఆరోగ్యశాఖ 1000 మొక్కలు, విద్యత్ శాఖ 2,04,000 మొక్కలు , జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ 5000 మొక్కలు, ఎస్సీ,బీసీ సంక్షేమ శాఖ 5000 మొక్కలు , ట్రైబల్ వెల్పెర్, ఐటీడీఏ 5000 మొక్కలు ,ఇతర శాఖలు 1,78,003 మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్దేశించారు. కాగా జిల్లా గ్రామీ ణాభివృది శాఖ ఆధ్వర్యంలో 334 గ్రామ పంచా యతీల్లో పంచా యతీకి ఒకటి చొప్పున మొత్తం 334 నర్సరీలలో 32,64, 997 మొక్కలు పెంచుతున్నారు.
మండలాల వారీగా నర్సరీలలో పెంచుతున్న మొక్కల వివరాలు..
మండలం జీపీలు(నర్సరీలు) మొక్కల పెంపకం
(లక్షల్లో)
ఆసిఫాబాద్ 26 2,54,161
రెబ్బెన 24 2,34,611
తిర్యాణి 29 2,83,488
వాంకిడి 28 2,73,712
కాగజ్‌నగర్ 28 2,73,712
కౌటాల 20 1,95,509
సిర్పూర్(టి) 16 1,56,407
బెజ్జూరు 22 2,15,060
చింతలమానేపల్లి 19 1,85,733
దహెగాం 24 2,34,611
పెంచికల్‌పేట 12 1,17,305
జైనూరు 26 2,54,161
కెరమెరి 31 3,03,039
లింగాపూర్ 14 1,36,856
సిర్పూర్(యూ) 15 1,46,632
-----------------------------------------------------------------------------------------
మొత్తం 334 32,64,997
-----------------------------------------------------------------------------------------