Share News

kumaram bheem asifabad-సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు

ABN , Publish Date - Oct 02 , 2026 | 11:17 PM

జిల్లాలో ని 335 గ్రామ పంచాయతీల్లో సమగ్రాభివృద్ధి కి ప్రణాళికలు రూపొంందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్‌ గ్రామ పంచాయతీ ప్రణాళిక (వీజీపీపీ) గ్రామసభలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో గ్రామీణ రహదారుల నిర్మాణం, మట్టి రోడ్లు, పొలాలకు వెళ్లే మార్గాల అభివృద్ధి, చెరువులు, కుంటల అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు. వీటితో పాటు నీటి నిల్వ ప్రాంతాల అభివృద్ధి, నీటి సంర క్షణ, ఇంకుడు గుంతలు, కాల్వలు, డ్రైనేజీ సంబం ధిత పనులు, భూమి అభివృద్ధి, భూ సార పరిరక్షణ, పంట పొలాల అభివృద్ధికి సంబంధించిన పనులు, మొక్కలు నాటడం, రహదారి పక్కన వృక్ష రక్షణ, బండ్‌ ప్లాంటేషన్‌ నిర్వహణ, గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలకు ఉపయోగపడే మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టనున్నారు

kumaram bheem asifabad-సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు
లోగో

- గ్రామసభల్లోనే అవసరాలకు అనుగుణంగా తీర్మానం

- పల్లెవాసులకు తీరనున్న కష్టాలు

కాగజ్‌నగర్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ని 335 గ్రామ పంచాయతీల్లో సమగ్రాభివృద్ధి కి ప్రణాళికలు రూపొంందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్‌ గ్రామ పంచాయతీ ప్రణాళిక (వీజీపీపీ) గ్రామసభలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో గ్రామీణ రహదారుల నిర్మాణం, మట్టి రోడ్లు, పొలాలకు వెళ్లే మార్గాల అభివృద్ధి, చెరువులు, కుంటల అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు. వీటితో పాటు నీటి నిల్వ ప్రాంతాల అభివృద్ధి, నీటి సంర క్షణ, ఇంకుడు గుంతలు, కాల్వలు, డ్రైనేజీ సంబం ధిత పనులు, భూమి అభివృద్ధి, భూ సార పరిరక్షణ, పంట పొలాల అభివృద్ధికి సంబంధించిన పనులు, మొక్కలు నాటడం, రహదారి పక్కన వృక్ష రక్షణ, బండ్‌ ప్లాంటేషన్‌ నిర్వహణ, గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలకు ఉపయోగపడే మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణ రాష్ట్రాని కి వీబీజీ రామ్‌జీ పథకం కింద రూ.1,263.41 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. జిల్లాలోని 335 గ్రామ పంచాయతీల పరిధిలో అవసరమైన పను లకు అనుగుణంగా నిధులను కేటాయించనున్నారు. వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా గ్రామాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన పనులను గుర్తించి, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళి కలను రూపొందించనున్నారు.

- ఆయా పంచాయతీల్లో..

ఇందుకు సంబంఽధించి అధికారులు శుక్రవారం జి ల్లాలోని ఆయా గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను ఏర్పాటు చేశారు. గ్రామసభల్లో ప్రధానంగా ఉపాధిహామీ పనులపై చర్చించి, గ్రామాల్లో కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు శాశ్వత ఆస్తులు సమకూరే పనులను గుర్తించనున్నారు. ప్రధానంగా నీటి సంరక్షణ, చెరువుల కుంటల అభివృద్ధి, కాల్వల పనులు, భూ సరా పరిరక్షణ గ్రామీణ రహదారులు తదితర అవసరాలను బట్టి పనులను ఎంపిక చేయనున్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల పరిధిలో ప్రజలకు అవసరమైన మౌ లిక వసతులను గుర్తించి వాటిని ప్రాధాన్యం క్రమం లో చేపట్టేందుకు గ్రామసభలో తీర్మానాలు చేయను న్నారు. రైతులు, కూలీలు, మహిళలు, గ్రామస్తుల నుంచి సూచనలు స్వీకరించి పనుల జాబితాను రూపొందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పని దినాలు కల్పించడంతో పాటు గ్రామాలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే ఆస్తుల నిర్మాణానికి అధికారులు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

నీటి నిల్వలు పెంచడం..

నీటి నిల్వలు పెంచడం, భూ సారాన్ని పరిరక్షిం చడం, వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతు లను అభివృద్ధి చేయనున్న పనులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తీర్మానాల ప్రక్రియ పూర్తి కాగానే అధికారులు పనులు అత్యవసరమున్న వాటికి అను మతి ఇవ్వనున్నారు. దీంతో గత కొన్ని సంవత్సరా లు గా ఇబ్బందులు పడుతున్న గ్రామీణులకు అత్యవసర పనులు తీరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రామసభల తీర్మానం ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకొని పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనున్నారు. కూలీలకు కూడా ఉపాధి కల్పించే లా చూడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతు న్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పలు గ్రామా ల్లోని అంతర్గత రోడ్లు పూర్తిగా అధ్వానంగా మారా యి. పలు చోట్ల బురదమయంగా, గుంతలమ యంగా మారడంతో ఆయా గ్రామాల ప్రజలు రాక పోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ పథకం తో గ్రామీణుల సమస్యలు తీర్చేలా చర్యలు తీసుకో వాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Oct 02 , 2026 | 11:17 PM