kumaram bheem asifabad- ఒక్కేసి పువ్వేసి చందమామ..
ABN , Publish Date - Oct 16 , 2026 | 10:30 PM
ఒక్కసి.. పువ్వేసి చందమామ.. ఒక్క జాములాయె చందమామ.. ఏమేమి పువ్వొచ్చనే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ అంటూ పలు మండలాల్లో అధికారులు శుక్రవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాగజ్నగర్ డివిజన్ ఉద్యోగులతో శనివారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ
కాగజ్నగర్/కెరమెరి/సిర్పూర్(టి)/వాంకిడి/జైనూర్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఒక్కసి.. పువ్వేసి చందమామ.. ఒక్క జాములాయె చందమామ.. ఏమేమి పువ్వొచ్చనే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ అంటూ పలు మండలాల్లో అధికారులు శుక్రవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాగజ్నగర్ డివిజన్ ఉద్యోగులతో శనివారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రీహర్షచౌదరి బతుకమ్మల వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మ ఆడలను ఆడారు. కెరమెరి మండలంలోని గోయగాంలో గురువారం రాత్రి జరిగిన బతుకమ్మ వేడుకల్లో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆట, పాటలతో బతుకమ్మ ఆడారు. బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన డీసీసీ అధ్యక్షురాలిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆత్రం ఆనంద్రావు, ఉప సర్పంచి రాందాస్ తదితరులు పాల్గొన్నారు. సిర్పూరు(టి) ఐకేపీ కార్యాలయంలో శుక్రవారం సిర్పూరు(టి) ఆదర్శ మహిళ సమాఖ్య డ్వాక్రా మహిళలు కలిసి సిర్పూరు(టి) తహసిల్దార్ రహీమోద్దీన్, డీపీఎం రాంటెంకి మహేష్, ఏపీఎం మహేష్ కలిసి, సర్పంచ్ ఒడ్డెటి నాగమణి మహిళలతో బతుకమ్మ సంబరాలు జరిపారు. కార్యక్రమంలో ఆదర్శ సంఘ మహిళలు పాల్గొన్నారు. వాంకిడి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శుక్రవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో తహసీల్దార్ కవిత, ఎంపీడీవో పాటిల్ జోత్స్న పాల్గొన్నారు. ఫూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ తహసీల్దార్, ఎంపీడీవోతో పాటు పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది సందడ చేస్తూ సంప్రదాయ పటలు పాడుతూ సంబరాల్లో పాల్గొన్నారు. జైనూర్. మండల కేంద్రంలోని బాలాజీ నగర్, పవర్ హౌస్ కాలనీ, గణేశ్నగర్, పవర్గూడ, కాలేజీగూడ తదితర గ్రామాల్లో బతుకమ్మ వేడుకల్లో మహిళలు సందడిగా పాల్గొంటున్నారు.