నాగర్‌కర్నూల్‌లో ఫిజియోథెరపీ అవగాహన ర్యాలీ
ABN , Publish Date - Sep 08 , 2026 | 11:22 PM
ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం లో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వ హించారు.
కందనూలు, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యో తి) : ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం లో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వ హించారు. పాత కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ హాజరై జెండా ఊపి ప్రారంభించిన ర్యాలీ అంబేడ్కర్ చౌరస్తావరకు కొనసాగింది. పా రామెడికల్ కళాశాల విద్యార్థులు ఫిజియో థెరపీ ప్రాధాన్యత గురించి నినాదాలు ఇ చ్చారు. కేక్ కట్‌చేసి పలువురికి సన్మానం చేశా రు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రవికుమార్, తెలం గాణ ఫిజియోథెరపీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ డీఎన్ సుమంత్, కార్యదర్శి డాక్టర్ ఎన్.సృజన, కోశాధికారి డాక్టర్ అంజలి, డాక్టర్ శైలజ పాల్గొన్నారు.